శ్రమ దాతలు

శ్రమ దాతలు

శ్రమకి శత్రువు బద్ధకం.
ప్రతిజీవికి శ్రమ అవసరం
శ్రమలేనిదే పొట్ట గడవదు
జీవనానికి పొట్ట ఆధారం
పొట్టకి ఆహారం ఆధారం
శ్రమ,తాను గెలవాలంటే తన
బద్ధ శత్రువు బద్ధకాన్ని ఓడించాల్సిందే.

చీమలు తమ పొట్ట కూటికోసమే కాక
తమ నివాసంకోసం స్థలం అన్వేషించి
మార్గ మధ్యంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని కఠోర శ్రమ చేసి తమ నివాసానికి పుట్ట కట్టుకుంటాయి.దానిని పాము దురాక్రమణ చేసి తన నివాసమేర్పరచు కొంటుంది.చీమ మళ్ళీ తన నివాసానికి పుట్ట కట్టు కోవాల్సిందే.

త్యాగాశీలి చీమ.

పాటరాని కాకి తాను ఎంతో కఠోర శ్రమతో కట్టుకొన్న గూటిలో,అత్యద్భుత స్వర కోకిలకి
స్థావరమిస్తుంది.
స్థల దాత కాకి.

ఎన్నో ఆకాశ హర్మ్యాలు, పెద్ద పెద్ద ప్రాజెక్టుల
నిర్మాణాలు కూలివాని కఠోర శ్రమ ఫలితమే.
శ్రమ దాత కూలి.

ప్రాపంచిక సుఖాలను పక్కకు నెట్టి ఎన్నో కఠోర శిక్షణల పొంది,ఎండ, వాన, చలి లెక్కచేయక ప్రాణాలొడ్డి యుద్ధ భూమిలో ఉరుకు జవాను.

శ్రమ దాత జై!జవాన్!

ఆహారం లేనిదే ప్రపంచం సున్నా. అట్టి ఆహారాన్ని చెమతోడ్చి కఠోర శ్రమతో తిండి గింజలను అందిస్తున్న రైతుకు నమస్తే.

అన్నదాత,రైతు కూలి.జై!కిసాన్!

పరిశ్రమలు లేనిదే అభివృద్ధి తిరోగమనం.
వాటిద్వారా ఎన్నో మానవ అవసరాలు తీర్చు
వస్తువులు పారిశ్రామిక కార్మికునుని కఠోర శ్రమ ఫలితమే.
వస్తు దాత పారిశ్రామిక కార్మికులు.

రోగిని కాపాడటమే లక్ష్యంగా నిద్రని కూడ లెక్క చేయక శ్రమతో లేచి వచ్చి రోగిని రక్షించును వైద్యులు
ప్రాణ దాతలు వైద్యులు

ఇతరులను కాపాడటానికి స్వచ్ఛందంగా కొందరు రక్తదానం చేయుదురు
రక్తదాతలు,వారు

తాము నేర్చుకొన్న విద్యని విద్యార్థులకు ఎంతో శ్రమతో బోధించును గురువు.
విద్యా దాత గురువు

మానవుడు కఠోర శ్రమతో మనసుకి పదును పెట్టి తన మేధస్సుతో కృత్రిమ మేధస్సు సృష్టించి(ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్)ఎన్నో అద్భుతాలు సృష్టించి విశ్వాన్ని మన కళ్ల ముందు ఉంచుతున్నాడు.
మనిషికి జై!

ప్రపంచానికే మేధస్సు దాత మనిషి.

– రమణ బొమ్మకంటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *