జాజిరి పాట-2
జాజిరి జాజిరి జాజిరి జాదా
జాజిరి జాజిరి జాజిరి జాదా
జాజిరాడ బోతే ఏమేమి దొరికే
జిల్లెడు చెట్లల్ల బెల్లమే దొరికేనాకు
బెట్టంటె నక్కకు బెట్టే
నక్క ముక్కుల నారింజ పుల్ల
పీకుంట పీకుంట బీమారం పాయె
బీమారం కోమట్లు మా మంచి వారు
సాదుకొమ్మని రెండు మామిండ్లు ఇచ్చే
మామిండ్ల దర్వాన పూత పూసే
పూత దర్వాన కాత కాసే
కాత దర్వాన పండు పండే
పండు తీసుకొని బల్లెకు పోతే
బల్లె కుక్కలన్ని బౌబౌ మనే
అప్పుడే నా ఒల్లు జల్లుమనే
జల్లుమన్న కాడ మల్లెలు పూసే..
– కిరణ్