ఇంగ్లీష్ మందులు మంచిదా ఆయుర్వేదం మంచిదా
ఇంగ్లీష్ మందులు మంచిదా ఆయుర్వేదం మంచిదా అంటే మనం పూర్వకాలంలోకి వెళ్ళాలి. ఇంగ్లీష్ మందులు అనేవి లేవు. రాజుల కాలంలో యుద్ధాలు చేసి గాయాలపాలైన వారికి అక్కడి వైద్యులు తెలిసిన మూలికా వైద్యం చేసేవారు. దాంతోపాటు ఆహార మార్పులు చేయడం వల్ల వారి గాయాలనేవి తగ్గేవి. ఇలా పూర్వకాలం నుంచి మనం మూలికల మీదే ఆధారపడ్డాము.
అయితే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చిన తర్వాత దేశాన్నంతా ఆక్రమించుకొని వైద్యం కూడా విలువైనదిగా భావించి వారి హస్తగతం చేసుకున్నారు. మన పూర్వీకులను బంధించి వారి ద్వారా మూలికల గురించి తెలుసుకుంటూ రకరకాల ఔషధాలను కనిపెట్టి వాటిని ప్రజల అందుబాటులో లేకుండా చేసి డబ్బులకు అమ్ముకున్నారు అదే ఇప్పటికీ కొనసాగుతుంది.
అయితే ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. మన ఇళ్లల్లో గృహిణిలు ప్రతిరోజూ కూరగాయలు కోయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు వేలికి ఏ చిన్న గాయమైనా వెంటనే అందుబాటులో ఉన్న పసుపును పూస్తారు. పసుపు యాంటీబయాటిక్ అని అందరికీ తెలిసిందే. అలాగే చిన్న పిల్లలకు దగ్గు వస్తే కాస్త అల్లం రసం బామ్మలు పాలతో కలిపియో తేనెతో కలిపియో నాకించడం కూడా తెలిసిందే.
జలుబు రాగానే ధనియాల టీ లేదా కషాయం కాచి ఇవ్వడం జ్వరం రాగానే వెల్లుల్లి కారం వేసి పెట్టడం లాంటివి అన్నీ మన పూర్వకాలంలో ఉన్న ఆయుర్వేద సూత్రాల మూలమే. అయితే ఇప్పటిదాకా ఇప్పటినాగారీకుల నాగరికత నేర్చుకున్న వారికి సమయం లేకపోవడం వల్ల వైద్యుల మీద ఆధారపడుతున్నారు. ఇనిస్టెంట్ ఫుడ్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ లాగా ఇనిస్టెంట్ గా తయారు చేసిన బిల్లలపై ఆధారపడి బ్రతుకుతున్నాం.
ఆయుర్వేద వైద్యం అందించాలంటే ఎన్నో మూలికలు సేకరించాలి వాటిని నీడలో ఆరబెట్టాలి లేదా ఎండలో ఆరబెట్టేవి కొన్ని ఉంటాయి. ఆ తర్వాత వాటిని పొడి చేయడం వాటికి తగిన మోతాదులో తేనె ఇంకా మిగిలిన ఔషధాలు కలిపి చిన్నచిన్న గోళీల మాదిరిగా చేసుకోవడం లాంటివాన్ని సమయాన్ని తినేస్తాయని చాలామంది ఇంగ్లీష్ మందులకు అలవాటు పడుతున్నారు.
ఈ ఇంగ్లీష్ మందుల వల్ల అప్పటికప్పుడు ఉపశమనం పొందినా ఆ తర్వాత వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉంది మాత్రల డోసులు పెంచుతూ మన శరీరాన్ని మనమే కుళ్ళ పరుచుకుంటున్నాం. అయితే ప్రతి చిన్న దానికి మందులు వాడకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఎన్నో లాభాలు పొందవచ్చా అనేది ఇంతకుముందు ఒక వ్యాసంలో తెలియజేశాను.
ఇంగ్లీష్ మందుల వల్ల సత్వరమే న్యాయం లేదా ఉపశమనం జరిగినా కూడా డోసులు పెంచుతూ పోవడం వల్ల ఒక స్థితికి వచ్చేసరికి ఆ మోతాదు సరిపోక ఇంకా ఎక్కువ మోతాదు కావాలని అనిపిస్తుంది. దాంతో ఒక్కొక్కరు రెండు రెండు మాత్రలు మింగవలసి వస్తుంది. ఉదాహరణకు మధుమేహ వ్యాధిని తీసుకుంటే అది వంశపారంపర్యంగాను లేదా మానసిక ఒత్తిడి పరంగాను వస్తుంది.
ఇప్పుడు ఈ వ్యాధి అందరికీ మామూలైపోయింది ఎందుకంటే శారీరక కష్టం లేకపోవడం, కూర్చుని పని చేసే సమయం ఎక్కువ కావడం వల్ల తిన్నది అరిగించుకోలేని స్థితికి చేరుకున్నాం కాబట్టి ఇది ఇప్పుడు పసిపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలు వరకు ఎవరికైనా వచ్చే వ్యాధిలా మారింది.
మరి ఈ వ్యాధి మన పూర్వకాలంలో లేదా అంటే ఉండేది అని మన పూర్వం చెప్తున్నారు కాకపోతే అప్పుడు కష్టం శారీరక శ్రమ పొలం పనులు వంటివి ఉండేవి కాబట్టి అందరూ శ్రమించి ఎండలో పనిచేయడం వల్ల ఏ వ్యాధులు దరిచేరేవి కావు. అలా వాళ్ళు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి మనం పాత తరం వ్యక్తులను చూస్తూనే ఉంటాం.
ఇక ఇప్పుడు ఈ మధుమేహ వ్యాధికి మొదలవగానే మనం మెల్లిగా డాక్టర్ దగ్గరికి వెళ్తాము. హైరానా పడిపోతూ ఎలా తగ్గించుకోవాలో అని అనుకుంటూ ఉంటాము అప్పుడు డాక్టర్ మనకి 2mg మోతాదు రాస్తారు. అవి వాడుతూ వాడుతూ మనం ఇంకా వాడుతున్నాం కదా ఏం అవదు అనే భరోసాతో మనకు నచ్చింది తింటాం దానివల్ల మళ్లీ మధుమేహం పెరుగుతుంది.
దాంతో ఇన్సులిన్ తీసుకునే స్థాయికి వెళ్లాల్సి వస్తుంది. ఇవేవీ లేకుండా ఆయుర్వేదాన్ని ఆశ్రయించినట్లయితే నెయ్యి షుగర్ వ్యాధికి దివ్య ఔషధం అనేది ఎంతమందికి తెలుసు? చాలామంది ఆయుర్వేద వైద్యులు చెప్పే సూత్రం ఒకటి ఏదైనా మోతాదుకు మించకుండా తినండి అని చెప్తారు అలాగే మజ్జిగ నీళ్లు ఎక్కువగా తాగమని అంటారు.
శారీరక శ్రమ చేయలేనివారు కనీసం సాయంత్రం నడక నడవమని సూచిస్తారు ప్రతిరోజు మన ఆహారంలో 100 గ్రాముల నెయ్యి 100 గ్రాముల నూనె తప్పనిసరిగా ఉండాలి అలాగే పచ్చి కూరగాయలు కూడా తినమని చెప్తారు. పచ్చి కూరగాయలు ఎలా తింటాం? పిజ్జాలు బర్గర్లకి అలవాటుపడ్డ శరీరం కదా… నాలుక ఎన్నో రుచులను కోరుతుంది అలాంటప్పుడు మనం ఇంగ్లీష్ మందులకే ఇంపార్టెన్స్ ఇస్తాం.
మోతాదు ఎక్కువ వేసుకొని తిని పదార్థాలు ఎన్నో తింటాం. ఆయుర్వేదం అనగానే అందరికీ పత్యం చేయాలి అనే భయం ఉంటుంది కానీ ఏదైనా మితంగా తీసుకోమని పత్యం అవసరం లేదని చాలామంది చెప్తారు కానీ ఈజీగా దొరికే ఇంగ్లీష్ మందులకు అలవాటు పడ్డ మనం ఆయుర్వేదాన్ని విస్మరిస్తాము. ఈ ఇంగ్లీష్ మందులు వాడడం వల్ల ఒక స్టేజ్ కి వచ్చేసరికి డోస్ సరిపోక విలవిలలాడే పరిస్థితి నెలకొంటుంది.
దానివల్ల మెంటల్ డిప్రెషన్ కి గురై చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఒక టాబ్లెట్ వేసుకుంటే దానికి అలవాటు పడిన శరీరం అంటే మత్తు పదార్థానికి ఎలా అయితే అలవాటు పడినవారు అది దొరకకపోతే ఎంత విలవిలలాడిపోతారో అలాంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇంగ్లీష్ మందుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది.
మరి అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే దాని ఆశ్రయించక తప్పదు ఎందుకంటే ఆయుర్వేదం నిదానంగా పనిచేస్తుంది. ఇంగ్లీష్ మందులు అప్పటికప్పుడు రిలీఫ్ ని ఇస్తాయి కాబట్టి అప్పటికప్పుడే రిలీఫ్ ఇచ్చే వాటికే చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తారు అయితే నేను ఇక్కడ ఆయుర్వేదం గురించి గొప్పగా ఇంగ్లీష్ మందుల గురించి తక్కువగా చేయడం లేదు ఏదైనా మోతాదుకు మించి తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం మాత్రమే.
మనకు ఏదైనా వ్యాధి మొదలవగానే ఒత్తిడికి గురవకుండా దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి నిదానంగా వ్యాధి తగ్గించే ఆయుర్వేదాన్ని ఎంచుకోవాలా లేదా అప్పటికప్పుడు ఉపశమనం కలిగించి డోసులు పెంచుకుంటూ పోయే ఇంగ్లీష్ మందులను ఆశ్రయించాలా అనేది వ్యక్తిగతం. దీని గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా మన రోగానికి మనమే వైద్యం చేసుకోవచ్చు అనేది మాత్రం యదార్ధమని చెప్పవచ్చు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఎవరిని కించపరచడానికి లేదా అవమానించడానికి రాసింది కాదు.
– భవ్య చారు