చిలిపి
భావానికి భాష అడ్డమా
అన్నంతగా చిలిపిదనం
వర్ణాలు ఒదిగిన ఒక
అనువైన అందం చిలిపితనం
మనసును మరచిన
చీకటి కోరిక ఒక చిలిపితనం
నవ్వుల లేఖల నందనం
ఊసులాడే ఊహల కథలు
ఒక చిలిపితనం
అక్షరాల సరిగమలు
తమాషా మాటల తూటాలు
ఒక చిలిపి తనం
ముద్దు మురిపాల పలుకు
సరదాల చిరునవ్వులు
ఒక చిలితనం
ఊరిస్తున్న చురుకుదనం
కొంటె పనుల
తుంటరి తనం ఒక
చిలిపితనం
భాష లేని కళ్ళ భావాల
ముడులు
తీపిగుర్తుల చిలిపి చేష్టలు
పలికి చిలికిన చిలిపితనం …
– జి జయ