చంద్రుడికో నూలుపోగు
వెలుతురు ధారాళంగా ఇచ్చి సూర్య కాంతితో
జగత్తుకు రక్షణ కల్పించుతున్న ఉషోదయాలు ఎలానో
చంద్రుడి చల్లని హాయి గొలిపే వెలుతురూ అవసరమే మానవాళికి
అయితే మన సమాజంలో
ఎందరోమహానుభావులుకూడా వారి సేవల ద్వారా
వారి కృషి వల్ల ఎంతో ఉపయోగ పడుతున్నారు.
ప్రత్యక్షంగా ను, పరోక్షంగా ను
వారికి మనం చేసే సత్కారాలు కాని సన్మానాలు
కానీ ఏ మాత్రము సరిపోవు.
(చంద్రునికి ఒక నూలు పోగు) అన్నట్లుగా మహనీయుల ఘనతకు
గౌరవప్రదమైన అవార్డుల ద్వారా వారుసమాజానికి
తెలియ చేయాల్సిన బాధ్యత మాత్రం అందరిది.
అదే కోవలో గరికపాటి నరసింహారావు గారికి
(పద్మశ్రీ) అందుకున్న సందర్భంగా మన సాహిత్య
అభిమానులకు ఒక మంచి
అభిమానం, అనుభూతినీ
ఇచ్చింది అనవచ్చు. వారు
సమాజంలోని మానవతా
కోణాన్ని , విలువల ప్రాధాన్యాన్ని చక్కగా చమత్కరుస్తూ, సమాజపు
మార్పులకు అనుగుణంగా
విషయాన్నినిక్కచ్చిగాతెలియ
చేసే విధానం, మనుషులలో
కొంతవరకు చైతన్యం తీసుకు రావడానికి కృషి
చేస్తున్నారు.
వారు ప్రతిభా పాటవాలను
కేంద్ర ప్రభుత్వము గుర్తించి
పద్మశ్రీ తో సత్కరించింది.
అలాంటి వారికి మనము
ఏమిఇచ్చి విలువకట్టలేము
కాబట్టి గౌరవప్రదంగా
ఆరాధన ,అభిమానభావంతో ఇచ్చేదే
(చంద్రుడికో నూలు పోగు) అనే సామెత
ద్వారా తెలియపరిచారు
మన పెద్దలు……?
– జి జయ