బేరం
వలసవాదం లోని ఇబ్బందులు
తెలుసేమో
అవి వలస పక్షులు కాలేదు
ఉన్నచోటులోనే శిఖరం చేరడాన్ని సాధన చేశాయి
వలస కులాసానివ్వదు
కుదురూ ఇవ్వదు
నెనరూ నేర్పదు
అభద్రత పల్లవి నేర్పుతుంది
వలస లేనిదే నాగరికతేలేదని
ఆవేశపడకండి
ఆప్తులు,నేస్తులుండగా
కుదురైన జీవితాన్ని పెళ్లగించి
వలస వాకిట్లో బేరం పెట్టాలా?
– సి. యస్ రాంబాబు