చైతన్య దీపికలు
చైతన్య దీపికలు ఆడపిల్లలు
శక్తి స్వరూపాలు ఆడపిల్లలు
సృష్టి స్వరూపిణీలు ఆడపిల్లలు
వెలసిల్లే వికాసాలు ఆడపిల్లలు
అనాది కాలంలోనైనా
ఆధునిక కాలంలో నైనా
సంబరమైన శాంతమైనా
సమాజపు వెలుగు రేఖల చైతన్య దీపికలు
జీవిత సౌరభాలను
విలసింప చేయు
చైతన్య దీపికలు
కళ్యాణమనే శబ్దంతో
మసకబారకుండా
మాణిక్యాలుగా తీర్చిదిద్దుదాం చైతన్య దీపికలను
భద్రతనే భరోసాగానిచ్చి
వెలగనివ్వాలి ఆడపిల్లలను ఆద్యంతం
స్వేచ్ఛ వాయువులు
పీల్చే శక్తి స్వరూపిణిలుగా
తీర్చిదిద్దబడాలి
అప్పుడే మనిషి మనగడ
సృష్టికి మూలమైన
ప్రకృతి కాంత వలె
చైతన్య దీపికలై
ప్రపంచానికి వెలుగు దివ్వలై నిలుస్తారు
మరి ……..?
– జి జయ