పరువు లేఖ
నీ దారి ఏదో నువ్వే ఎంచుకున్నావు
నీ దారి రాజమార్గం చేయాలి అనుకున్నాను
నీ దారి తెలియక తొందరపడ్డావు
నా పరువు కోసం నీ దారి పూలదారి చేసేలోపు గోదారి చేసుకున్నావు
పరువు పోగొట్టుకొని ప్రాణం పోయేలా చేసిన నీ దారి నాకు ఎడారి చేశావు.
ఇప్పుడు పరువు ముఖ్యమై ప్రాణం తీసుకున్న ఒక తండ్రి పరువు లేఖ
– సూర్యక్షరాలు