బాలల దినోత్సవo
బాలలము మేము బాలలము
రేపటి తరo పౌరులం
భవిష్యత్తు తరాలకు మేధావులo
భావి భారత నిర్మాతలము
చాచా నెహ్రూ ముద్దు బిడ్డలం
తల్లిదండ్రుల రేపటి ఆశలం
కన్నవారి కలలు నిజం చేసే వారసులం
ప్రజలకు సేవ చేస్తూ
భావి తరాలకు ఆదర్శంగా నిలిచే వాళ్ళం
అల్లరి చేస్తూ అందర్నీ అలరించే పిల్లలం
అనుకుంటే ఏదైనా చేసే అల్లరి పిడుగులo
బుద్ధిగా చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టే
దివ్య జ్యోతులం …
బాలలము మేము బాలలము
రేపటి తరం పౌరలం…
మా పండగ నేడు మాదే పండగ
అల్లరల్లరి చేయక బుద్దిగా ఉంటాం
దేశానికి వన్నె తెచ్చే భావి తారలం మేము
– అర్చన