అక్షర నీరాజనం
తేనెలా మా మనసుల్లో చేరావు
కన్నే మనసుతో కన్నెల హృదయాలను కొల్లగొట్టి
గూడచారిలా గుండెల్లో నిలిచావు
ఇద్దరు మొనగాళ్లు అంటూ అందర్నీ ఆశ్చర్య పరిచావు
మీకు సాక్షి నేనేనంటూ అలరించావు
మరపురాని కథలెన్నో చెప్పావు
స్త్రీ జన్మ గొప్పదని చాటావు
ఉపాయంతో అపాయాన్ని దటవచ్చని తెలిపారు
ప్రైవేట్ మాస్టారుగా పాఠాలే నేర్పావు
అవే కళ్ళతో లోకాన్ని చూడమంటూ చెప్పావు
అసాధ్యము కాదేది అంటూ మార్గం చూపావు
నిలువు దోపిడి కి దేవుడైన కరగాల్సిందే అన్నావు
మంచి కుటుంబాన్ని మించిన సంపద లేదన్నావు
సర్కారు ఎక్స్ప్రెస్ లో అమాయకుడిలా ప్రయనించావు
అత్త గారు కొత్త కోడళ్ళు ఎలా ఉండాలో చూపావు
అల్లూరి ని నేనే అంటూ గుండె ధైర్యం చూపావు
ఈనాడుతో సమాజంలో కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయని చూపావు
లక్ష్మి నివాసం లో లక్ష్మి కొలువై ఉందన్నావు
నేనంటే నేనే నాకెవరూ సాటి లేరు అన్నావు
ఉందమ్మా బొట్టు పెడతా అంటూ చెల్లెలి కాపురం దిద్దావు
వింత కాపురం అంటూ వింతైన కథ చెప్పావు
మంచి మిత్రులు ఎలా ఉంటారో తెలిపావు
లవ్ ఇన్ ఆంధ్ర అంటూ ఆంధ్రులను అలరించావు
భలే అబ్బాయిలు అంటూ నీతి తెలిపారు
బొమ్మలతో కథలు చెప్పించావు
మహా బలుడను నేనేనన్నవు
శభాష్ సత్యం అంటూ సత్యాన్ని చాటావ్
ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదన్నావు
టక్కరి దొంగకు చక్కని చుక్క దొరికిందని సంబర పడ్డావు
విచిత్ర కుటుంబం ఉందంటూ అందరికీ తెలిసేలా చేసావు
ముహూర్త బలం లో జరిగిన కథ లో జగత్ కిలాడీలు ఉన్నారన్నావు
అన్నదమ్ముల అనుబంధం గురించి నేర్పించావూ
కర్పూర హారతి అందుకున్నావు
బందిపోటు భీమన్న కు అక్కాచెల్లెళ్ళు కు తోడుగా నిలచావు
సింహాసనాన్ని అధిష్టించిన రారాజు కే వన్నె తెచ్చావు
జగదేక వీరున్ని నేనేనంటూ అందానికి అందం లా నిలిచావు
నెంబర్ వన్ నేనే అంటూ నీకంటూ ఒక కొత్త ఒరవడిని సృష్టించారు
అమ్మదొంగా అంటూ ప్రేక్షకుల ను ఆలరించావు..
కౌబాయ్ లా సాహసాలకు మారు పేరుగా నిలిచారు.
అటూ ప్రేక్షకులను, ఇటూ ప్రజలకు సేవ చేస్తూ అందరూ సమానమే అంటూ నిరాడంబర జీవనం గడుపుతూ ఉమ్మడి కుటుంబం లో కలతలనేవి రాకుండా చూసుకుంటూ జీవితాన్ని ప్రశాంతంగా గడిపి, మమ్మల్ని అందరినీ శోక సంద్రంలో మంచి కార్తీక మాస పుణ్య దినాన శివైక్యం చెందిన మిమల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీకివే మా అక్షర నీరాజనాలతో ఆశ్రు నివాళి అర్పిస్తంది అక్షర లిపి టీమ్.