అర్థ నారిశ్వర తత్వం

అర్థ నారిశ్వర తత్వం

అర్ధనారీశ్వర తత్వం అంటే శివపార్వతులను చూపిస్తాం ఎందుకంటే వారు ఒకరిలో ఒకరు ఇద్దరిలో ఒకరై నిలిచారు ప్రతి జంటకు ఆదర్శంగా వారిద్దరిని చూపిస్తాం. తన భర్తను గౌరవించ లేదని తనకు తానే భస్మం అయిన భార్యను తనలో అర్ధనారిశ్వరీ శక్తి గా మార్చుకున్నాడు. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్యా భర్తలు. పిల్లలు ఎవరి స్వార్థం లో వారున్నారు.

ప్రేమ అంటూ అవసరాలు తీర్చుకోవడానికి వాడుకుంటూ, భార్య భర్తల బంధాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తూ అసలు తత్వాన్ని మరిచిపోయి కొన్ని సందర్భాల్లో తమను తాము హిందించుకుంటూ మరికొన్ని సందర్భాల్లో అవతలి వారిని సైతం హింసిస్తూ స్వార్థం కోసం ప్రాణాలు సైతం తీస్తున్నారు. అసలు భార్యా భర్త అనే పదాలకు అర్ధనారీశ్వర తత్వానికి అర్థం మారిపోయింది. గత పదేళ్ల క్రితం భార్య, భర్త, పిల్లలు ఈ బంధం అనేది ఎంతో అందంగా కనిపించేది.

నాకు తెలిసిన ఒక చిన్న కుటుంబం భార్య భర్త ఇద్దరు పిల్లలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు గొడవలు అనేవి మచ్చుకైనా కనిపించేవి కావు. అదే సమయంలో టిక్ టాక్ అనే ఒక యాప్ వచ్చింది. భర్త పిల్లలు వెళ్లిపోయాక ఉబుసుపొక ఆ వీడియోలు చూస్తూ ఉండేది. చూస్తూ నచ్చిన వాటికి లైకులు కొడుతూ కామెంట్లు పెడుతూ ఉండేది అలా కామెంట్లలో ఒక అతను ఆమెకి పరిచయమయ్యాడు.

వాళ్ల మధ్య మాటలు పెరుగుతూ వచ్చాయి అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్లు స్నేహం నుంచి ప్రేమగా మారి, అక్రమ సంబంధం వరకు వెళ్ళింది విషయం. అతనిలో తన భర్త లో లేనిది ఏముందని అడిగితే అతను సరదాగా నవ్వించడం నాకు నచ్చిందని చెప్పింది. మరి నీ భర్త కూడా నిన్ను నవ్విస్తాడు కదా అంటే దానికి దీనికి తేడా ఉంది. అ

తను భర్త కాబట్టి నవ్వు రాకున్నా నవ్వాలి అయినా భర్త పోగడడు, ఇతను తానెవరో తెలియక పోయినా నవ్విస్తున్నాడు, నువ్వు నవ్వితే బాగుంటావు అని పొగుడుతూ ఉన్నాడని చెప్పింది. అయ్యో ఇన్నేళ్ల కాపురం తర్వాత ఇలా కేవలం నవ్వించాడు అనే ఒకే ఒక్క విషయానికి ఆవిడ అక్రమబందం వైపు వెళ్ళడం వారి జీవితాల్లో పెద్ద మార్పు తెచ్చింది. అతనికి విషయం తెలిసి ఇది తప్పు అన్నాడు నా ఇష్టం అంది ఆవిడ ఇద్దరి మధ్యా గొడవల్లో పిల్లలు నలిగిపోయారు.

ఇక భరించలేని ఆవిడ అతనితో వెళ్లిపోయింది. అతను భరించాడు ఓపికగా పిల్లల్ని చూసుకున్నాడు. భార్య వెళ్లిందని ఎవరెన్ని మాటలు అన్నా ఓపికతో ఉన్నాడు కానీ ఏ అఘాయిత్యం చేసుకోలేదు. ఎలా భరిస్తున్నారు అని అడిగితే నా భార్య పిచ్చిది, ఏదో చిన్నపిల్ల మనస్తత్వం ఇప్పుడు కాకుంటే నాలుగు రోజుల్లో వస్తుంది నాకు నమ్మకం ఉంది అన్నాడు.

అన్నట్టు గానే ఆవిడ నాలుగు రోజుల్లో వచ్చేసింది. ఇక్కడ అతను ఆమెని ఇంట్లోకి సంతోషంగా ఆహ్వానించాడు. కానీ చుట్టాలు స్నేహితులు వద్దు అన్నారు. శీలం కోల్పోయింది అన్నారు, కానీ అతను లేదు నా భార్య చాలా మంచిది ఏ తప్పు చేయలేదని గట్టిగా చెప్పడంతో ఇక వారందరూ ఏమి చేయలేక వెళ్ళిపోయారు. ఆమె ఆ రాత్రి అతని తో నేను నిజంగా శీలం కోల్పోలేదు అని చెప్పింది.

అతను నాకు తెలుసు అన్నాడు… ఎలా అన్నదా భార్య, అప్పుడతను నాలో సగం నువ్వు, నేను తప్పు చేస్తే నువ్వు చేసినట్టే, కానీ నేనేమీ తప్పు చేయలేదు కాబట్టి నువ్వు కూడా చేయవు అనే నమ్మకం అదే అర్థ నారిశ్వర తత్వం అన్నాడు. ఆవిడ అతని గుండెల్లో ఒదిగిపోయింది…

– భవ్య చారు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *