మనిషికి మరో గ్రహంలో చోటు దొరుకుతే
భూమాత రుణం తీర్చకముందే
మనిషి మరో గ్రహం లో సంచరించాలని సాధన మొదలుపెట్టాడు?
సృష్టిలోని జనన మరణరహస్యం చేదించాలని మనిషి
పరితపన !
మనిషి మీద సుతో మరో లోకం కోసం ఆరాటం
చంద్రమండలంలో చోటు కోసం కొత్త ఆలోచనలు
అంగారకునిపై కంచెలు వేయాలని ఉత్సాహం
అంతరిక్ష శోధన చేసి
గ్రహాల్లో కాలు మోపాలని
గ్రహాంతరవాసుల ఉనికి తేల్చాలని అన్వేషణ
సృష్టికి ప్రతి సృష్టి చేయాలని
నక్షత్రాలకు కూడా నామకరణం చేసి
నయా దునియాను నిర్మించాలని!
ఏ గ్రహంలోనైనా జీవం ఉండడానికి అనుకూలమేనా అని
అంతరిక్ష శోధనలు
ఉంటే మాత్రం ఆలస్యం లేకుండా ప్రయాణించాలని
మనిషి ఉబలాటం
అది తీరితే గ్రహాంతర బాట మరో గ్రహంలో
మనిషి సంచారం
కాగలుగునోమరి….?
– జి జయ