అపార్థం
హేమ,శ్వేత,అనిల,జ్యోత్న చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ..ఎలా అనుకుంటున్నారా? క్లాస్ మేట్స్ కాదు కానీ అంతా గృహిణులే! అయితే ఒకటే వీధి పక్క పక్క ఇళ్లే! దాంతో అందరూ
కలిసి మెలిసి ఉండేవాళ్లు..ఎక్కడికి వెళ్లాలన్నా అందరూ కలిసే వెళ్లేవాళ్లు..ఏ పండుగలు వచ్చినా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్లు..
వాళ్ల భర్తలు పిల్లలు కూడా వీళ్లు ఇలా కలిసి ఉండడానికి సహకరించే వాళ్లు..వేరే ఇళ్లల్లో ఉన్న వాళ్లు వీళ్లను చూసి ఈర్ష్య పడేవాళ్లుఅయితే అందులో ఉన్న అనిల మాత్రం కిరాయకు
ఉంటుండె మిగతా అందరివీ స్వంత ఇళ్లు..ఒకసారి అందరు కలిసి మంచి పార్టి చేసుకున్నారు
అందరూ కలిసి డబ్బులు వేసుకుని చేసుకున్నారు.
అదయ్యాక అనిల వాళ్ల అమ్మ వాళ్ల ఊరికి వెళ్లాల్సివచ్చింది. తను లేకపోయే సరికి మిగతా ఉన్న వాళ్లు కలుసుకుని అనిల పై ఏవో ముచ్చట్లు పెట్టుకున్నారు..అనిల వచ్చాక శ్వేత తనతో నీవు కిరాయకుంటావనినిన్ను ఏదో మాటలన్నారు హేమ ,జ్యోత్న అని చెప్పింది..
ఆ మాటలకు అనిల చాలా బాధ పడింది ..కిరాయకుంటె ఏంటి? నేనేమన్నా దేంట్లో తక్కువ ఉన్నానా? అన్నిటికీ సమానంగానె ఇస్తా కదా!అన్నది అనిల..ఏమెానె! నా పేరు చెప్పకే! నేను చెప్పానని అంది శ్వేత ఏ పార్టీ అయినా అనీల ఇంట్లోనె చేసుకుంటారు కిరాయ ఇళ్లయినా చాలా పెద్దగా ఉంటుంది..దాంతో ఇంట్లో తినుబండారాలు ఏవయినా అన్నీ తీసి
ఇచ్చేది..
ఇక ఈ విషయం విన్న దగ్గర నుంచి అనీల మనసు బాధతో రగిలి పోయింది..హేమ,జ్యోత్న లతో సరిగ్గా మాట్లాడడం లేదు..ఎందుకో వాళ్లకు అర్థం కావడం లేదు..ఎన్ని సార్లు అడిగినా ఏమీ చెప్పలేదు అనీల..ఇక వాళ్లు ఊర్కే అడగడంతో శ్వేత ఇలా చెప్పిందని చెప్పేసింది..
అయ్యెా! మేమలా అనలేదు..నువ్వు కిరాయకున్నా ఓనర్లతో సమానంగా అన్నీ ఇస్తావు చందాలయినా ఏవయినా అసలు అందరూ ఓనర్స్ ఎక్కువిస్తారుఅద్దెకున్న వాళ్లు తక్కువ ఇస్తారు ఇక్కడ ఇదే రూల్అని అనడంతో!అనిల అపార్థం తొలగి పోయింది..శ్వేతను కూడా పిలిచి తనకు కూడా అర్థం అయేలా
చెప్పారు..
ఇక అపార్థాలు తొలగి పోయి అందరూ మునపటిలాకలిసి ఉన్నారు..అపార్థం కొంత కాలం అందరినీ బాధ పెట్టింది..అందుకే అపార్థాలు చేసుకోవద్దు అర్థం చేసుకోవాలి
ఆనందంగా ఉండాలి..
-ఉమాదేవి ఎర్రం