ఆన్లైన్ లో అపార్దం 

ఆన్లైన్ లో అపార్దం

 

మొన్న ఒక సోషల్ మీడియా అకౌంట్ లో ఒకావిడ ఒక పిక్ పెట్టీ ఇదేమిటో చెప్పండి అని అన్నారు. దాన్ని చూడగానే మీకు ఏమనిపించింది అని అడిగారు. దానికి చాలా మంది రకరకాలుగా సమాధానాలు పెట్టారు.

కాస్త ఆలస్యంగా దాన్ని నేను చూసాను. వెంటనే నాకు అనిపించింది పెట్టాను. పైగా నేను పెట్టిన కామెంట్ తో పాటూ సారీ కూడా చెప్పాను. దానికి ఆవిడ చాలా ఫీల్ అవుతూ అయ్యో కాదండీ ఇది అమెరికా వారి బ్రేక్ ఫాస్ట్ అని అన్నారు.

అయ్యో అవునా నాకు తెలియదు కదండీ మీరు అనిపించింది పెట్టమని అన్నారు కాబట్టి నేను అలా అన్నాను అని మళ్లీ సారీ కూడా చెప్పాను. ఇక నా కామెంట్ చూసిన మిగిలిన వాళ్ళు నా నన్ను అపార్థం చేసుకుని దాడి కి దిగారు మాటలతో ఆహారాన్ని అలా అంటారా ఎవరైనా మీకు బుద్ది ఉందా అసలు అంటూ ఏవేవో మాట్లాడారు.

అంత రచ్చ అవుతూ ఉండడం వల్ల ఆవిడ ఇదంతా నేను పిక్ పెట్టడం వల్లనే కదా తీసేసాను అన్నారు. అలాగే తీసేశారు కూడా, నేను ఆమె తో అన్నాను నాకు అనిపించింది చెప్పాను అండి మీరేమీ అనుకోవద్దు. అని. కానీ ఆవిడ అపార్థం చేసుకుని అది అమెరికాలో బ్రేక్ ఫాస్ట్ అండి . నేను కనుక్కుని చాలా కష్టపడి సొంతంగా తయారు చేశాను మీరు అలా అనేసరికి నాకు బాధగా అనిపిస్తుంది అన్నారు .

తర్వాత ఇంకోకావిడ నేను అన్న విషయానికి పెట్టిన కామెంట్ కి వివరణ ఇస్తూ అవి మెడిసిన్స్ లో ఉపయోగిస్తారు అలాగే మనం వాటిని పూజిస్తాము. తాగుతాము కూడా అంటూ చెప్పడం తో ఆవిడ రియలైజ్ అయ్యారు. నిజమే కదా అన్నట్టు. కానీ ఒక అమ్మాయి ఫీల్ అయితే ఆమెకు సపోర్ట్ గా మన మహారాజులు ఉంటారు గా హీరోలు అవ్వాలనే కోరిక తో ఆమె గురించి నన్ను చెడు గా మాట్లాడడం, ఆహారం విలువ తెలియదు అంటూ హేళన చేయడం జరిగింది.

అప్పుడు కూడా ఆవిడ పాపం నేను పిక్ తీసేసాను కదా ఇంకెందుకు మీరు అనడం అంటూ చెప్పినా రెచ్చిపోయారు. కుక్కలు మోరుగుతాయి లే అని అనుకుంటూ నేను ఆ చెత్త నుండి బయటకు వచ్చాను.

ఇంతకీ ఆవిడ చేసిన అమెరికా బ్రేక్ఫాస్ట్ చాక్లెట్ తో చేశారు అది నల్లగా మూడు కుప్పలుగా ఉంది. దాని పక్కనే తేనె వేశారు. అది చూడడానికి పేడ ముద్దలు, గో మూత్రం లాగా అనిపించింది. నేనూ అదే చెప్పాను. దానికి గొడవ జరిగింది.

ఇంకొకవైపు మరో ఆవిడ ఆమె చెప్పింది కరెక్ట్ అవి అలాగే ఉన్నాయి. అయినా మీకు తెలుసా పెండ ను వైద్యం లో విరివిగా వాడతారు. అలాగే ఆయుర్వేదం లో కూడా పెడకట్టు వేస్తారు. అగరు వత్తులు తయారు చేస్తున్నారు. ఇక గో మూత్రం ఆరోగ్యానికి మంచిది అని తాగుతారు. అలాగే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు. దానిని తెచ్చుకుని మరి తాగుతాం. దాంట్లో తప్పు లేదు అని అన్నారు.

అవును నిజమే కదా వేప పుల్లలు అమెరికాలో అమ్మడం లేదా, మీ కొల్గెట్ లో ఉప్పు ఉందా అంటూ యాడ్స్ రావడం లేదా , బొగ్గు తో ఫేస్ ప్యాక్ లు వస్తున్నాయి కద , ఇదే మగవారు వాటిని వేసుకుని అందాన్ని పెంచుతున్నారు కదా ,
మన అమ్మ తరం వాళ్ళు బొగ్గు, ఉప్పు, వేప పుల్లలు, పేడ పిడకలు తో వంటలు చేయలేదా , ఇప్పటికీ ఆన్లైన్ లో పేడ పిడకల ను అమ్ముతున్నారు కదా ,

మరి అలాంటప్పుడు ఆవిడ అన్నదంట్లో తప్పేముంది. అన్నవారందరు ఒక్కసారి ఆలోచించండి. నా గురించి మిరేవో మాట్లాడుకున్నారు సరే వదిలేయండి. నేను అవన్నీ పట్టించుకోను. కానీ మీకు ఆలోచన లేదా ? ఒకమ్మాయి ముందు హీరో అవ్వాలి అంటే ఇంకొక అమ్మాయిని చెడు గా చూపించాలా ఇదెక్కడి న్యాయం ? మంచి అనిపించు కోవాలి పులిహోర లు కలపాలి అంటే ఇంకో విధంగా కలుపుకోండి.  కానీ ఇంకొకర్ని బలి చేయడం ఎంతవరకు సమంజసం అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నా…

నా గురించి నా వెనకాల ముందు మాట్లాడినా. ఏనుగు ముందు కుక్క ఆరిచినట్టే,

 

-భవ్య చారు 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *