అన్నదమ్ములు
అన్నదమ్ముల అనుబంధం అత్యున్నత అనుబంధం
జీవితకాల అనురాగానికి విలువైన బంధం
ఒకే తల్లి చనుబాలు త్రాగి ఒకే తల్లిదండ్రులు కలిగిన అపూర్వ అనుబంధం రక్తసంబంధం
పుట్టకముందే వచ్చిన ముడి పడినబంధం కలిసిమెలిసి పెరిగిన బాల్యం
తల్లిదండ్రుల కనుసన్నల్లో పెరిగిన ప్రేమ బంధం
కష్టసుఖాల్లో తోడుగా నిలిచే ఆత్మీయ బంధం
అడ్డుగోడల ప్రపంచంలో
మాట తోనే కానీ
నోటుతోనే కానీ
అన్నదమ్ముల అనుబంధాన్ని
విభజించుకోవద్దు
ప్రేమాభిమానాలతో జీవితాంతం భగవంతుడు ప్రసాదించిన వరమవ్వాలి అన్నదమ్ముల అనుబంధం
ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా కుటుంబ విలువలను కాపాడుతూ
రుణ బంధమైన అన్నదమ్ముల అనుబంధాన్ని ప్రేమకు ప్రతీకలై నిలవాలి
మోసానికి అందరూ అర్హులే అన్నట్టుగా అనుబంధాల చిత్రాలు కూడా మారిపోయే కాలం
రోజులు ఏవైనా గాని అన్నదమ్ముల అనుబంధం ఆనంద గీతికలే కావాలి ఎప్పటికీ అని కోరుకుందాం మనం అనుబంధాలు ఉన్న అందరం…..
– జి జయ