అన్నదమ్ముల అనుబంధం
వాళ్ళు చేసే అల్లరిని చూసి
వాళ్ళని బాగా ఏడిపించవచ్చు…
ఎన్నో గొడవలు పడుతాము
ఒకరు అంటే మరొకరికి ప్రాణం
రక్త సంబంధం అంటే ఇదేమోనో
ఎవరైనా ఏమైనా అంటే మా అక్క
తమ్ముడు, అన్నయ్య, చెల్లి
అని ఎదురు తిరుగుతాము…
వాళ్ళు బాధ పడితే అసలు చూడలేరు
గొడవ జరిగిన అంతసేపు శత్రువులు,
తర్వాత కలిసిపోతాము…
మాకు ఎలాంటి సమస్య వచ్చినా
అమ్మలా ఆదుకుంటావు…
అమ్మా నాన్నల తర్వాత నువ్వే
అన్నీ అయి నాకు తోడుగా నిలచావు…
ఇదేమోనో అన్నదమ్ముల అనుబంధమోనో
అని నేను అనుకున్నాను…
- మాధవి కాళ్ల