అన్నా చెల్లెలి అనుబంధం
రాఖీ పండుగ వచ్చిందంటేశిరీషకు ఎంతో ఆనందంగాఉండేది. అన్న రాముకురాఖీ కట్టేది. రాము తనచెల్లి శిరీషకు కొత్త బట్టలు,మిఠాయిలు కొనేవాడు.దేశ సేవ చేయాలనేది రాము
ఆశయం.
అలా ఆనందంగా ఉంటున్నవారి జీవితంలో ఒక విషాదంచోటు చేసుకుంది. అసలేమిజరిగింది అంటే రాము సైన్యంలో పనిచేసేవాడు.భారత దేశ సరిహద్దుల్లో పనిచేసేవాడు. ప్రతి రాఖీ పండుగకు తప్పనిసరిగాఇంటికి వచ్చి చెల్లి చేత
రాఖీ కట్టించుకునేవాడు.
ఈ సారి కూడా రాఖీ పండుగరోజు చెల్లితో రాఖీ కట్టించుకోవాలని వారం రోజుల ముందే సెలవు పెట్టాడు. రేపుతన ఊరికి వెళతాడు అనగాఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందాడు. రాము కుటుంబసభ్యులు చాలా బాధపడ్డారు.
వారి ఇంటిలో విషాదం చోటుచేసుకుంది. రాము చెల్లి శిరీషఅయితే పిచ్చిదానిలా ఏడవటం మొదలుపెట్టింది.
అందరూ బాధపడుతున్నసమయంలో రాఖీ పండుగరోజు కొన్ని సైనిక వాహనాలు
రాము ఇంటి ముందు ఆగాయి.
ఒక సైనిక అధికారి రాముఇంటికి వచ్చి”చూడు శిరీషా,మీ అన్న దేశానికి చేసిన సేవమరువలేనిది. ఆయన వీర
మరణం పొందారు. అది మనకు ఎంతో బాధ కలిగిస్తుంది.
నిన్న మీఅన్న డైరీ చూసాను. అందులోమీ అనుబంధం గురించి వ్రాసాడు. నీ కోసం బట్టలు కూడా కొన్నాడమ్మా. చెల్లి పట్ల అతనికిఉన్న ప్రేమకు నేను చలించిపోయాను.
అందుకేనేను వెంటనే ఇక్కడికి వచ్చాను. నేను మీ అన్ననుతిరిగి తీసుకుని రాలేకపోవచ్చు కానీ ఈ రాఖీ
పండుగ రోజు నన్నుఅన్నగా భావించి రాఖీకట్టమ్మా.మీ అన్న నీ కోసం కొన్నబట్టలు తీసుకోమ్మా.రాము ఆత్మకు శాంతి లభిస్తుంది”అన్నారు.
తన అన్న ఫొటో ముందు నుంచుని ఆ సైనిక అధికారికి రాఖీ కట్టింది శిరీష.అన్న ఆశయాన్ని ముందుకుతీసుకుని వెళ్ళాలని నిర్ణయంతీసుకుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని