రాఖీ పౌర్ణమి

 రాఖీపౌర్ణమి

 

అన్నయ్య

అమ్మానాన్నల తర్వాత అన్ని నువ్వే నాకు అన్నయ్య ,
అమ్మ లాంటి కోపం నాన్న లాగా ధైర్యం ఇస్తూ ,
నేను అలికితే బుజ్జగించావు ,
నేను తప్పు చేస్తే దండించావు ,
ఎవరైనా నన్ను ఏమన్నా ,
నువ్వు నన్ను వెనకేసుకొని వచ్చే వాడివి ,
నాతోపాటు అప్పుడప్పుడు అల్లరి చేసే వాడివి ,
ఎన్నోసార్లు నువ్వు నాతో పోట్లాడిన ,

గొడవపడిన  మళ్ళీ మనం కలిసిపోయే వాళ్ళం.
నేను ఏ పని చేసినా మెచ్చుకునే వాడివి ,
అన్నాచెల్లెలు ఎంతో ప్రేమగా  ఉన్నా

మనిద్దరం విడిపోతామని అస్సలు అనుకోలేదు.
నీ పెళ్లి కారణంగా దూరమవుతావని అసలు అనుకోలేదు.
ప్రతి రాఖీ రోజు నీ దగ్గరకు వచ్చి రాఖీ కట్టేదాన్ని ,
ఆరోజు మొత్తం మనిద్దరం హ్యాపీగా గడిపే వాళ్ళం.
దూరమైన తర్వాత నీకు రాఖీ కట్టడానికి రావాలి అనుకున్నా ,
కానీ పెద్దవాళ్లు గొడవల్లో మన అన్నాచెల్లి

అనుబంధం కూడా నలిగిపోయి దూరమైపోయాము.
నువ్వు ఎప్పుడూ నాకు తోడుగా ఉంటావ్ అనుకున్నా ,
నా ప్రతి కష్టం నీతోనే పంచుకున్నాను.
దూరమైన తర్వాత నీతో మాట్లాడాలని 

నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను , కానీ కుదరలేదు.
నువ్వు అన్నయ్యగా నన్ను అమ్మ నాన్న కంటే ఎక్కువ అర్థం చేసుకున్నావ్.
పెద్దవాళ్లు గొడవ పడితే మనం ఏమి చేసావ్ మాట్లాడుకోకుండా  ఉన్నాం.
ఒక్కసారి నీ దగ్గరికి వచ్చి నీ గుండెల మీద నా తల పెట్టుకొని ఏడవాలని ఉంది అన్నయ్య.
మా అన్నాచెల్లి అనుబంధం ఎప్పుడు దూరం కాకూడదని దేవుడికి కోరుకునేదాన్ని ,
కానీ ఇలా దూరం అవుతావని అస్సలు అనుకోలేదు.
ఈ రాఖీ పౌర్ణమి కైనా నీకు రాఖీ కట్టి ,
నా కష్టసుఖాలు అన్ని నీతో పంచుకోవాలని ఉంది అన్నయ్య.
ఈ రక్షాబంధన్ తోనైనా మన ఇరు కుటుంబాలు కలవాలని  కోరుతూ ,
నీకు రక్షబంధన్ కట్టి మనం ఇంతకముందులా
కలిసి ఉండాలి అనుకుంటున్నాను.

 

-మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *