ఎదురు చూపు
ప్రతి రక్షాబంధన్ లాగానే భానుఈసారి కూడా రాఖీ పండుగకోసం ఎదురుచూస్తోంది.క్రితం సంవత్సరం వరకు భానుతన అన్నకు రాఖీ కట్టేది.
అన్నప్రసాద్ కూడా తన శక్తి కొలదితన చెల్లెలు భానుకు ఏదోఒక గిఫ్ట్ ఇచ్చేవాడు. క్రితంసంవత్సరం భానుకు పెళ్ళిఅయ్యింది.
పెళ్ళిలో భాను భర్తతరఫు కుటుంబం వారు పెట్టిపోతల విషయంలో ప్రసాదుతో గొడవ పడ్డారు.అందుకే ఈ సారి అన్నతన ఇంటికి రాడని ఆమెభావించినా మనసులో ఎక్కడో చిన్న ఆశ మిణుకు- మిణుకుమంటోంది.
రాఖీపండుగ రానే వచ్చింది.అన్నయ్య ప్రసాద్ మాత్రంరాలేదు. ఆమె ఎంతోబాధపడింది. మధ్యాహ్నంభోజనం దగ్గర కూర్చున్నప్రసాదుకు అన్నం సయించలేదు.
వెంటనే చెల్లెలి ఇంటికిబయలుదేరి వెళ్ళాడు. చెల్లితనకోసం ఎదురు చూస్తోందిఅని అతని మనసు చెప్పింది.రాత్రి ఇంటికి వచ్చిన అన్నయ్యని చూసి ఆమెసంతోషపడింది.
అప్పటికప్పుడు రాఖీతయారు చేసి కట్టింది.ఇంట్లో ఉన్న పంచదారతీసుకుని అన్న నోరుతీపి చేసింది. అన్నాచెల్లెలఅనురాగం చూసి ప్రసాద్ బావగారి కంట్లో నీళ్ళుతిరిగాయి.
వెంటనే ఆయనప్రసాదుని అక్కునచేర్చుకున్నారు. ఆ విధంగాకధ సుఖాంతం అయ్యింది.రాఖీ పండుగ అన్నా చెళ్ళెళ్ళప్రేమకు ప్రతిరూపం.
-వెంకట భానుప్రసాద్ చలసాని