అమ్మాయి జీవితం
ఆడపిల్ల…
ఆడపిల్ల అని పుట్టగానే ఇది ఆ ఇంటి బిడ్డ అని పేరు పెట్టారు ఆనాడు ఏనాడో.. తెలీదు… పెట్టిన వారికి ఆడపిల్ల లేదో మరీ ఉన్నవారిని చూసి ఓర్వలేక పోయాడో.. తెలీదు..
కడుపున ఊపిరి పోసుకున్న క్షణం నుండి.. ఆడపిల్ల అంటే ఛీదరించుకునే వారు ఇంకా చాలా మంది ఉన్నారు… ఊపిరిని ఆపేసేవారు..
పుట్టగానే.. మన ఇంట్లో పుట్టిన మహాలక్ష్మి అని గుండెలకు హత్తుకునే వారు ఉన్నారు…
అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు…. కొందరు
ఆపదల్లోకి తోస్తున్నారు ఇంకొందరు..
ఎదిగేటప్పుడు కొన్ని కళ్ళు చూడలేక పోతున్నాయి..
అక్కడికీ వయసును మర్చిపోయి కూడా ఆడపిల్ల జీవితాన్ని శాసిస్తున్నారు…
కొందరు…
ఎదిగాక ఇంకో ఇంటికి పసుపు తాడు అనే ఓ ఉరి తాడు నీ మెడకు బిగించి..
ఓ అయ్య చేతిలో పెట్టి సాగనంపితే… ఆ అమ్మాయి కలలు కన్న ఎంతో అందంగా ఊహించుకున్న జీవితంలోకి వచ్చిన భర్త…
తనని బరించేవాడు అయి ఉండొచ్చు, బాధ పెట్టే వాడు కావచ్చు, బలి తీసుకునే వాడు కూడా అయి ఉండొచ్చు..
అర్దం చేసుకునే వాడు కాకుండా ఎలాంటి వాడు వచ్చినా ఆ అమ్మాయి జీవితం నిప్పుల కుంపటి లాంటిదే…
బయటికి రాలేదు మంటను తట్టుకోలేదు…
అలా అని ముందడుగు వేసి బయటికి వస్తె…?
వస్తె..
బయట ప్రపంచం కాకుల్ల కాదు
రాబందుల్లా పొడుచుకు తింటున్నాయి..
అవి అయినా కాస్త నయం ప్రాణాలు పోయాక
కానీ లోకులు… ప్రాణం ఉండగా ఊపిరి ఆడనివ్వరు…
ఇలా అడుగడుగునా… ఇంట్లో కన్న వాళ్ల దగ్గరి నుండి మొదలు పెడితే పరాయి వాళ్ల వరకు..
ఆడపిల్ల జీవితాన్ని శాసించే వారే..
ఒక ప్రాణికి జన్మనిచ్చే ఆడది..
తన ప్రాణాలను తన జీవితాన్ని మాత్రం కాపాడుకోలేక పోతుంది..
ఇన్ని సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన తన జీవితం ఒడ్డుకు చేరేది ఎపుడో..
చేర్చే వారు ఎవరో..
రారా రారేమో.. వస్తారా.. అది నమ్మకం లేదు ఏ ఆడదానికి..
అయినా ఎదురు చూస్తూ గడుపుతుంది..
తన జీవితాన్ని ఒక ఆడపిల్ల..
ఆడపిల్ల ఈడపిల్ల కాదు ఆడ పిల్లే..
ఆడపిల్ల ఆడుకునే ఆటబొమ్మే…
ఇది మారాలి అని కోరుకుంటున్న.. ఇంకా ఆడవాళ్ళని పైన చెప్పిన ఉద్దేశం తో చూసే వారు అందరూ..
– వనీత రెడ్డీ