అమ్మతో ఒక జ్ఞాపకం..

అమ్మతో ఒక జ్ఞాపకం

 

మా అమ్మ ఒకసారి ఏం చేసిందంటె..నన్ను తన చిన్నప్పటి ఫ్రెండు దగ్గరి బంధువులని తనకొడుక్కిచ్చి పెళ్లి చేసింది..మాదేమెా కరీంనగర్ సిటీ వాళ్ల ఫ్రెండ్ దేమెా పక్కా పల్లెటూరు..
అక్కడ పచ్చటి పొలాలు గోదావరి అందాలు చాలాబాగుంటాయి..కానీ అవి కూడా ఊర్కే వెళ్లడానికి ఉండదు..ఎందుకంటె ఆ ఇంటి పద్దతి కరీంనగర్ కు వెళ్లేటప్పుడయినా వచ్చేటప్పుడయినా చిన్న కచ్చురం( అంటే ఎడ్ల బండి ) దాంట్లో మంచిర్యాల వరకు వెళ్లిబస్సెక్కాలి దానికి కూడా పరదా కట్టి ఉంటది.కానీ వేరే ఏ విధమయిన టైంపాస్ లు ఉండవు చాలాబోర్ కొట్టేది..అయినా పెళ్లయ్యాక తప్పదు కదా!నేను కరీంనగర్ రాగానె మా అమ్మ అన్ని సినిమాలుచూపించేది. షాపింగ్ లకు తిప్పేది కావలసినవన్నీ
కొనుక్కుని మళ్లీ అత్తారింటికి వెళ్లేదాన్ని..

అలా జరిగేది ఇక మా పాప పుట్టింది. ఒక సారి అలాగెకరీంనగర్ కు వచ్చాను..ఏదో కొత్త సినిమా వచ్చింది సినిమాకు తీసుకు వెళ్లిందిఫుల్ రష్ ..టికెట్లు దొరక లేదు లాస్ట్కి ఒకఃకటే దొరికింది నన్నులోపలికి పంపించి మా అమ్మ మా పాపను పట్టుకునిబయటనే కూర్చుంది.ఇంటర్వల్ లో పాపను తీసుకొచ్చి పాలు ఇప్పించి మళ్లీవెళ్లింది..వద్దమ్మా నేను చూడనన్నా వినలేదు..మళ్లీ మీ ఇంటికి వెళితే సినిమాలు ఉండవు కదా!మేమిక్కడ ఎప్పుడంటె అప్పుడు చూడవచ్చు అనేది..

అమ్మకు అంత ఆలోచన..ఇక నా కిష్టమయిన వంటలన్నీ చేసి తినిపించేదిఅమ్మకున్న ప్రేమ ప్రపంచంలో ఎవరికీ ఉండదు ఇలాంటిసంఘటనలు నాకు ఎన్నో ఉన్నాయి..ఏదో ఒకటి గుర్తొచ్చి రాసాను..మీకూ ఉండే ఉంటాయి కదా!నా జ్ఞాపకం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్!

 

-ఉమాదేవి ఎర్రం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *