అమ్మా…

అమ్మా…

అమ్మా…!
నీ మీద ప్రేమ చెప్పటానికి కూడా అవకాశం వస్తుందనుకోలేదు.
అమ్మా…!
చిన్నతనంలో, నీమీద ఇష్టాన్ని చూపించడమంటే, నీకు దగ్గరగా వచ్చేవారిని  వారించటంలో చూపించాను. నువ్వు నన్ను తప్ప ఎవరిని ప్రేమగా చూసినా, వారిని ద్వేషించడంలో, నీమీద ఇష్టాన్ని చూపించాను.
నాకు పుట్టినరోజు అయినా, పండగ అయినా నీతో చేసుకుంటే చాలు అనుకుంటానమ్మా, నాకు నీకు లోకంగా వుండాలని, ఒక్కదాన్నే వుండాలి అనుకున్నాను. ఎవ్వరి మీద ద్వేషం లేదమ్మా నీమీద ఇష్టం మాత్రమే, అందరి మీద కన్నా ఎక్కువ వుంది.

నచ్చని పని అయినా, చెయ్యనంటూ చేస్తూ ఉండటంలోనే, నాప్రేమను చూపించానమ్మా.

పట్టుమని పదిరోజులు కూడా నీకు దూరంగా వుండలేక ఏడ్చినప్పుడు,ఆఏడుపులో

నా ప్రేమను కనిపించలేదా అమ్మా!   పెళ్ళి చేసుకుంటే, నువ్వు ఆనందపడతావని నీకు దూరంగా వుండాలని తెలిసికూడా,నీకు నచ్చినట్టు,నీఆనందం కోసం

పెళ్ళికి ఒప్పుకుని అందులో నా ప్రేమను చూపించానమ్మా. అడగందే అమ్మ కూడా పెట్టదంటారు. కానీ,మా అమ్మను  అడగక్కర్లేదు.నాకు అవసరమైనవి తనే ఇస్తుందని అక్కడ నీ మీద ప్రేమను మౌనంలో చూపించానమ్మా,ఇచ్చిన వాటిలో ప్రేమను వెతుక్కోవాలి అనుకున్నానే కానీ,

అడగకూడదనే పంతం లేదమ్మా.నాన్న కూచినే గానీ, నువ్వంటే ప్రాణం అమ్మా..! ప్రేమను చూపించినా, అది అర్థమయ్యేలా చూపించటం రావాలని,ఇలా చూపించిన ప్రేమను లేఖలో రాసి పంపిస్తున్నాను.

అమ్మా.. ఐ లవ్ యూ

– ఇట్లు నీ బొజ్జి (రాధికా. బడేటి)

0 Replies to “అమ్మా…”

  1. అమ్మ ప్రేమను మించిన ప్రేమ ఈ ప్రపంచంలో నే లేదు తెలిసి తెలయక అమ్మను బాధ పెట్టిన అమ్మ ప్రేమ లో మార్పు వుండదు.సూపర్ సూపర్ ఆండీ 👌👌👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *