జాతర
వేష భాషలేవైనా
ప్రకృతిమాత వొడిలో
సోయగాల ఊయలలో
వుప్పొంగిన మనసుతో
పశు పక్షాదుల పలకరింపులు
కొండా కోనల్లో సంబరమనిపించే
సామాన్యుడి ఉత్సవం
సాగిపోయే జనంతో
నిండిన సంద్రంలో
పరుగులే ప్రభంజనంగా
జన సంద్రపు జాతర
సాంప్రదాయ సంఘంలో
ఓ గులకరాయి జాతర
బ్రతుకే పండుగా
అందొక చిన్ననాటి
చిరుజ్ఞాపకం.
ఆ అనుభూతి అమోఘం
ఆ ఆనందం అద్భుతం
ఆ ప్రదేశం మదిలో ఓ జ్ఞాపిక.
– జి.జయ