నీ తపస్వి
తేది: సజీవము
ఊరు : ప్రేమ
దేవతకి,
ఈ తపస్వి ఊపిరులతో ప్రాణం పోసిన జీవాక్షరాలతో నిన్ను అభిషేకిస్తూ…….
నీ సమ్మతి ఎందుకు నాకు ఓ ప్రాణమా! నాది ప్రేమ, నీది జోడైతే ప్రేమలవునా ?
నిన్ను చూసిన నిన్న నన్ను చేసెను ఓ తపస్వి. ఈ కఠోర దీక్షలో నీవు ప్రత్యక్షమౌడము
ఎందుకే ? నేనే నీకు నిత్య పూజారిని,
నీకు తెలియనిది నా ప్రేమ, అది చిన్నారిదే, సఖీ….! రెక్కలొచ్చె నిన్న,
ఎగురుతుండెను నేడు. నా లేతనైన రెక్కల సవ్వడి చేర్చదేప్పుడే నీకు నా ప్రేమ సంగతి.
ఇంకా రెక్కలు తొడగనిది నీ ప్రేమ వేచి ఉంటాను, దేవీ, నా ప్రేమ సజీవము.
ఎగిరొచ్చి, తప్పక దర్శనమిస్తావు, తుదకు నీది అనుగ్రహమే, ఓ, నా చెలి !
ఇట్లు నీ తపస్వి
– వాసు