అలజడి
నా అంతరంగంలో ఏదో తెలియని
అలజడికి లోనవుతుంది…
ఆ అలజడికి కారణం ఏంటో నాకే
తెలియడం లేదు..
ఎందుకు నేను ఆందోళనకు గురి అవుతున్నానో
దానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూన్నా..
నా అంతరంగంలో గతం తాలూకు అనుభవాలు
వెంట ఆడుతున్నాయా..
నాకు గతం తాలూకు అనుభవాలు అసలు గుర్తు లేవు..
బాల్యం నుంచి వయస్సు పెరిగేకొద్దీ అనుభవాల రూపంలోనూ, ఆలోచనల రూపంలోనూ
నేను చాలా ప్రత్యేకం, అంటూ తనకు తాను పెంచుకున్న అహం మెల్లగా దాని అస్తిత్వాన్ని కోల్పోవడం మొదలవుతుంది…
అజ్ఞానాన్ని గ్రహించి, దాన్ని తొలగించుకొని జ్ఞానం వైపు మనిషి ప్రయాణం మొదలుపెట్టేసరికే జీవితంలో శక్తియుక్తులు క్షీణించుకుపోతాయి..
మనిషి అంతరంగ శోధనను సమూలంగా ఓ భావజాలంలోకి లాక్కెళ్లి నువ్వు అనుభవిస్తుంది..
ఒక్కోసారి ఏ కారణం లేకుండానే అంతరంగంలో అలజడిగా ఉంటుంది…
ఏ పనీ చేయాలనిపించదు. సోమరితనం ఆవరించడమే కాదు.. ఏదో తెలియని విసుగు, అసహనం పట్టి పీడిస్తాయి..
అంతరంగంలో అలజడి మొదలు అవ్వకుండా
జాగ్రత్త పడాలి..
మనలో అలజడి అసలు మంచిది కాదు..