అజ్ఞాతం
పేరు లేని సంతకం అజ్ఞాతం
అజ్ఞానం వీడితే
అజ్ఞాతం అద్భుతాన్ని
ఆవిష్కరిస్తుంది.
అజ్ఞాతం సరికొత్త
జీవిత కోణం.
అజ్ఞాతంలో రాత్రి ఎండలు
పగలు చీకటిగా ఉంటుంది
కాల నిర్ణయం లో
తలుపు తెరిచిన ఘటన
చేదునిజంలాంటి అజ్ఞాతం
కారణాల కలతలు
నిన్నటి అనుభవాల
రేపటి అజ్ఞాత పాఠాలు
అజ్ఞాన తిమిర సంహారాలు
సావధానపు సమీకరణం
అలల తాకిడికి
అలజడి చేసిన సంద్రం
ఏశాస్త్రము భోదించని గ్రంధం అజ్ఞాతం
సత్య సాధనలో అజ్ఞాతం
కనివిని ఎరుగని
తెలియని పునర్జన్మ
– జి జయ