లోకం తీరు
ఈ మధ్య రాజ్ చాలా దిగులుగా ఉంటున్నాడు.అసలేమైందంటే రాజ్చేసే వ్యాపారంలో నష్టంవచ్చింది. దానికి కారణంఅతను నిజాయితీగావ్యాపారం చెయ్యడం.మంచి నాణ్యమైన సరుకులుతెచ్చి అమ్మేవాడు.
నాణ్యమైనసరుకుల రేటు ఎక్కువగానేఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అతనిషాప్ పక్కనే ఉన్న షాప్ఓనరు చక్రవర్తి నాసిరకంసరుకులు తెచ్చి తక్కువధరకు అమ్ముతున్నాడు.
సహజంగా ఎక్కడ తక్కువధర ఉంటుందో అక్కడికే వెళ్ళిసరుకులు కొంటారు జనం.దానివల్ల రాజ్ షాపుకు వచ్చేవారు తగ్గిపోయారు. అందుకే
రాజ్ వ్యాపారంలో చాలా నష్టపోయాడు. రాజ్ తనమితృనితో”చూడు మిత్రమా,నేను చాలా శ్రమ పడి నెంబర్.1సరుకులు తెచ్చి నా షాపులో అమ్ముతున్నాను.
మరి నాపక్కన ఉన్న షాపు ఓనర్చక్రవర్తి రెండవ రకం(నాసిరకం) సరుకులు తెచ్చిచవకగా అమ్ముతున్నాడు.జనాలు నాణ్యత చూడటంలేదు. నాణ్యత లేకపోయినాచౌకగా ఉన్న వస్తువులే కొంటూఉన్నారు.
ఈ లోకం కళ్ళున్నాగుడ్డిది”అన్నాడు. అప్పుడామితృడు”చూడు రాజ్, కొనేవారు నాణ్యమైన వస్తువులే కొంటారు.
ఒకసారి చక్రవర్తిదగ్గర సరుకులు తీసుకున్నవాళ్ళు మళ్ళీ అక్కడకువెళ్ళరు. ఒకసారి నీ దగ్గరకువచ్చిన వారు మళ్ళీ-మళ్ళీ నీదగ్గరకే వస్తారు. ఖంగారు పడకు.
మళ్ళీ నీ వ్యాపారంఅభివృద్ధి చెందుతుంది” అన్నాడు. మితృడు అన్నట్లేరాజ్ వ్యాపారం అభివృద్ధిచెందింది. మంచి నాణ్యమైన వస్తువులన అందరూ కోరతారు అనేది అక్షర సత్యం.
-వెంకట భానుప్రసాద్ చలసాని