నా కళ్ళు మసకబారాయి
సమాజం చాలా మారుతోంది.
మంచి నుండి చెడువైపుకు
వేగంగా అడుగులు వేస్తోంది.
అవినీతికి పట్టం కట్టేస్తోంది.
మంచికి సమాధి కట్టేస్తోంది.
లంచమిస్తేనే పనులు అయితే
నిజాయితీకి స్ధానం ఎక్కడ?
కాగితానికే విలువ ఎక్కువైతే
మనిషి మాటకు విలువ ఏది?డబ్బు సంపాదించే తొందరలో మానవత్వం మరచిపోతోంది.
మోసం చేసైనా ధనం పొందే
ఆలోచనలు పెరిగిపోయాయి.
పాపభీతి లేని సమాజంలో
మంచి మనిషికి తావులేదా?
కన్నీటితో నా కళ్ళు మసకబారాయి
సమాజం మారాలంటే మనం
అంతా మారాలేమో.
ఎందుకంటే మనం కూడా సమాజంలో భాగమే కదా.
-వెంకట భానుప్రసాద్ చలసాని