అభివృద్ధి
సంస్కృతిలో దాగిన సంప్రదాయపు ఆచారాలు
అనాదిగా దాగిన విజ్ఞానపు గనులుకదా
పెరుగుతున్న అభివృద్ధిలో అనాదిగా వస్తున్న
శాస్త్రములే ఆధారమవగా
సాంకేతికతలు ఆపాదించి అభివృద్ధంతా మనదేనంటూ
అజ్ఞానంలో బ్రతికేస్తున్న మానవుడా కనులు తెరువు!
వంట ఇంటి సరంజామాలో దాగిన శాస్త్రీయత తెలుసుకో
పెరటి చెట్ల ఔషధగుణాలు గురుతెరిగి మసలుకో
గుమ్మములో ముగ్గులలో దాగున్నది దయాగుణం
మామిడాకుల తోరణము ఇచ్చునుగా ప్రాణవాయువు
జీవరాశులే ఆధారముగా కనుగొంటిమిగా సాధనములు
దయాగుణము మాటున దాగున్నదిగా మానవత్వము
ఆచారము వెనుక నిండినదిగా శాస్త్రీయత
సంస్కృతి మాటున నిలిచెనుగా వైజ్ఞానికత
చెట్ల బెరళ్ళు వేరులు ఆకులు ఔషధములే అగును
పెరుగుతున్న జనాభాతో సమసిపోయే ఆచారము
విజృంభించెను అనారోగ్యాల కాలుష్యపు సెగలు
ఇకనైనా తెలుసుకుని మసలుకో మానవుడా!
నీ వంటిల్లే ఔషధాగారమని
పెరడే మూలికావనమని
ఆచార సంప్రదాయములు మూఢనమ్మకాలు కావని
అనాదిగా ఋషులు మునులు అందించిన
వివిధ శాస్త్ర సాంకేతిక బాంఢారమని…
– ఉమామహేశ్వరి యాళ్ళ