న్యాయం
న్యాయానికే న్యాయం చేయాల్సిన రోజులు ఇవి
చట్టానిది ఒక న్యాయం
ధర్మానిది ఒక న్యాయం
డబ్బున్నవారికి ఒక న్యాయం
సామాన్యుడికి ఒక న్యాయం
రాజకీయానికి ఒక న్యాయం
స్వార్థానికి ఒక న్యాయం
చెప్పడానికి ఒక న్యాయం
ఆచరణకి ఒక న్యాయం
సొంతవారికి ఒక న్యాయం
పక్కవారికి ఒక న్యాయం
సమాజానికి ఒక న్యాయం
అవకాశానికి ఒక న్యాయం
పరిపాలకులకు ఒక న్యాయం
ప్రజలకు ఒక న్యాయం
ప్రశ్నిస్తే ఒక న్యాయం
బదులిస్తే ఒక న్యాయం
న్యాయం ఆయుధం అనేది
ప్రశ్నగానే మిగులుతుంది
న్యాయం నాలుగు పాదాల్లో
నడిస్తేబావుండుఅనిఅనుకోవడం మనవంతు అయ్యింది…?
– జి జయ