జరభద్రం
దట్టమైన పొగలు ఒకచోట చేరి
కచేరిపెట్టినట్లుంది ఆకాశం..
ఉరుముల మెరుపుల అరుపులతో ఆక్రోశిస్తుంది గగనం…
ఎడతెగని వేదనేదో నిండబోతుందన్నట్లు ఆవేదనతో వర్షిస్తుందా నింగి…
అంతే…హఠాత్తుగా నిశ్శబ్దమలముకుంది జగత్తున…
సరికొత్త అరాచకానికి తెరలేచిందా గల్లీలో…
చిరుతిండెరచూపి ఆరగించాడో కామాంధుడా బాలికను….
కంటికి మింటికి వర్షిస్తూంది కన్నీరు జగత్తను అమ్మ…
రైతులంతా నడచి నడచి అలసి సొలసి విసిగి వేసారుతుంటే..
ఆదరించని సాయమివ్వని దుశ్చర్యలకి
అనాదిగా దారిదొరకక దిక్కుకానక
కార్చే కన్నీరు ఇంకిపోయినదీ చీకటిలోనే….
అన్యాయాలు..అక్రమాలు…
జూలు విదుల్చుకుని
ఠీవిగా రొమ్ము విరుచుకు తిరిగేదిపుడే….
మాటువేసిన మేకవన్నెలు దాడిచేసేదీవేళనే…
ఇల్లు ఒల్లు కొల్లగొట్టబడి నడివీధినపడే ప్రజానీకాలిపుడే..
జర భద్రం కొడకా!!!!
– ఉమామహేశ్వరి యాళ్ళ