యువత అబద్ధపు జీవితం

యువత అబద్ధపు జీవితం

నన్ను మా అమ్మ నాన్నలు ఏ లోటూ లేకుండా పెంచారు. అన్ని సౌకర్యాలు దగ్గర ఉండి చూసుకునే వారు అల్లారు ముద్దుగా పెంచారు ఒక్క కొడుకునే అని.. నా ఇష్టాన్ని కాదు అనలేదు ఏ నాడూ.. నాకంటే ఒక అడుగు ముందే ఉండి అన్నీ సమకూర్చేవారు.. కానీ నాకు చదువు కంటే పాటలు పాడడం అంటే చాలా ఇష్టం.. అమ్మ వాళ్ళకు నేను గొప్పగా చదువుకోవాలి అని ఉండేది. అమ్మ నన్ను ఒకే ఒక్క కోరిక కోరింది.. నువు చదువులో ఫస్ట్ రావాలి అని..

నాకేమో అది అంతగా పట్టక పోయేది.. పాటల వైపు ఎక్కువ ఆసక్తి చూపే వాడిని.. ఇటు చదువు మీద ధ్యాస తగ్గుతూ వస్తుంది.. కానీ అమ్మకు ఆ విషయం చెప్పకుండా.. పాటలు అంటే ఇష్టం అంటే ఎక్కడ కోప్పడుతుందో అని భయంతో చెప్పేవాడిని కాదు.. అలా నేర్చుకోవడానికి అబద్దం చెప్పి చదువు కోసం అని పాటలు నేర్చుకోడానికి వెళ్ళే వాడిని..

అలా కొద్ది రోజులకు పరీక్ష ఫలితాలు వచ్చే సమయం నేను అమ్మకి మాట ఇచ్చినట్టు ఫస్ట్ క్లాస్ లో నెగ్గుతాను అని సంతోషించింది.. కానీ నాకు పాస్ మార్కులు కూడా రాలేదు.. దాంతో అమ్మ చాలా బాధపడింది. నీకు ఒక్కగానొక కొడుకు ఇలా చేయిదాటిపోతున్నాడు అని అందరూ అడిగితే తల దించుకోవాలి కదరా అని నిలదీసింది.. కానీ నేను నిజం చెప్పలేకపోయాను ఎందుకు అంటే నన్ను ఏ రోజూ ఒక్క మాట కూడా అనలేదు అలాంటిది ఆరోజు నా మీద చాలా అరిచేసింది..

అప్పుడే నిజం చెప్తే కోపం ఎక్కువ అవుతుంది అని చెప్పలేక పోయాను.. అలా ఆ రోజు నుంచి అమ్మ నాతో సరిగా మాట్లాడేది కాదు.. నాకు చాలా బాధేసింది.. దాంతో ఇంట్లో గొడవ అయి ఇంట్లో నుండి వచ్చేసాను.. నేను నాకు ఏది ఇష్టమో చెప్పకుండా ఇష్టం లేని బ్రతుకు బతకలేక చాలా ఇబ్బంది పడ్డాను.. అలా వచ్చిన నేను. నేను ఎంచుకున్న దారిలో మంచి స్థాయిలో ఉన్నాను.. ఇంట్లో కూడా తెలిసింది.. మంచి స్థాయిలో ఉండడం చూసి అమ్మ చాలా మురిసిపోయింది.. ఇప్పుడు నా మీద కోపం కూడా లేదు.. ఎప్పటిలాగే నన్ను చూసుకుంటుంది..

కానీ అమ్మ ఒకటే అడిగింది, నాన్నా నువ్వు ఎం అవ్వాలి.. ఏం సాధించాలి అనుకున్నవో ఆ రోజే చెప్పి ఉంటే ఇన్ని రోజులూ మాకు దూరంగా ఉండేవాడివి కాదు కదా అని… అప్పుడు నేను అన్నాను, అమ్మ మీరు చదువు చదువు అని అదే పాట పాడుతున్నారు.. కనీసం నాకు ఇష్టమా లేదా అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు.. అలాంటి పరిస్థితిలో నేను మీకు ఎం చెప్పగలను….? అదీ కాక నేను ఆరోజు చెప్పి ఉంటే మీరు ఒప్పుకునే వారు కాదు. ఈ రోజు నేను అనుకున్నది సాధించాను కనక మీ అబ్బాయి నలుగురిలో ఒక పేరు సంపాదించాడు కాబట్టి, మీరు నలుగురికి గర్వంగా చెప్పుకుంటున్నారు… అదే ఆ రోజు చదువులో తప్పాను అని తిట్టారు… అక్కడ నేనే ఇక్కడ నేనే.. కానీ సాధించిన ఘనత వేరు..

పిల్లల్ని పద్ధతిగా పెంచండి. అన్నీ ఇవ్వండి.. కానీ వారి ఇష్టాలను తెలుసుకుని వారికి చేయూతను ఇవ్వండి… ఎందుకు అంటే అందరికీ కాలం సహకరించదు.. అందరికీ ఇలా కలిసి రాదు. ఎందరో తల్లి తండ్రులను ఎదిరించలేక… వారికి ఇష్టం లేని అబద్ధపు జీవితం గడుపుతున్నారు… ఎందుకంటే ఒకరికి భయం, ఒకరికి బాధ, ఒకరికి కష్టాలు, ఒకరికి కుటుంబ గౌరవాలు.. ఇవన్నీ తీర్చలేక నలిగి రలిగి ప్రాణాలు కూడా కోల్పోతున్న యువత ఉన్నారు… ఈ ఒక్క చదువు విషయం లోనే కాదు.. ప్రేమ, పెళ్లి, చదువు, ఉద్యోగం ఇలా ఎన్నో…. వాళ్ళకు నచ్చింది ఎంచుకొనివ్వక… మీకు నచ్చింది చేయలేక నలిగి పోతుంది యువత..

ఓ యువత ఇలా ఎంతో ఎన్నో విషయాలలో నలిగిపోతూ జీవితాన్ని గడుపుతున్న మీకు నా కోటి నమస్కారాలు….

తల్లి తండ్రులకు అయిన పిల్లలకు అయిన ఒక విన్నపం.. మీరు కనే కలలను పిల్లల మీద రుద్దకండి…. ఎందుకు అంటే మీకు ఇష్టం ఉన్నంత మాత్రాన వారు చేయాలి అంటే చేయలేరు కదా అర్దం చేసుకోండి. మీకు ఆకలేసి తినమంటే అది వారు బలవంతంగా తిన్నా వారికి ఇంపతి కాదు.. ఇది కూడా అంతే.

పిల్లలు, తల్లి తండ్రులు కదా మీ భవిష్యత్తు బాగుండాలి అని వారి తాపత్రయం అంతే తప్ప మీకు ఇష్టం లేనిది చేయించాలి అని కాదు.. ఇంట్లో నుండి ధైర్యంగా రాగలిగే మీరు… ఒక్క నిమిషం ఆగి అమ్మ నాన్న నేను ఇది చేయాలి అనుకుంటున్నా అని చెప్పి చూడండీ.. వినలేదా, వినేలా అర్దం అయెలా చెప్పండి.. మీరు ఎన్ని సార్లు చెప్పి ఉంటారు.. మహా అయితే రెండు సార్లు, మూడు సార్లు.. లేదా పది సార్లు.. మీరు ఒప్పుకునే వరకు మీ ప్రయత్నం ఆపకండి.. అయినా కొందరు వినరు అనుకొండి.. అయినా సరే ఒప్పించండి లేదా మీరు అనుకున్నది సాదించండి.. మీ గెలుపుని అయితే కాదు అనలేరు కదా..

– వనీత రెడ్డీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *