యుద్ధం
నగరాన్ని నిద్రలేపక్కర్లా
పడుకుంటేనే కదా!
నగరం రాత్రిపూట మరో ప్రపంచాన్ని చూస్తుంది
ఆకలితో పస్తుండేవాళ్ళు,జానెడు జాగా దొరక్క తిరుగుతుంటారు
జాలిగుండెతో కన్నీటి స్నానం చేయిస్తుంది!
తిన్నదరగనివారికి నగరమో నిషాకనుల సుందరి
కార్ రేసింగ్ బైక్ రేసింగ్ లతో
నగరంతో ఆడుకుంటారు
ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తుంటుంది!
భద్రజీవులం కదా
కలల ప్రపంచంలో మన యుద్ధాలు మనవి
నగరానిది మాత్రం తెరిపిలేని యుద్ధం!
– సి.యస్.రాంబాబు