యథా బ్రహ్మండం, తదా పిండండం
పరమాత్మ, ఆత్మ ల యొక్క ఎకైక సృష్టియే ఈ విశ్వరూపం పరమాత్ముని యొక్క దశావతారాలు అదేవిధంగా జీవునికి కూడా దశావతారాలు ఉన్నాయి.
పరమాత్ముని యొక్క దశావతారాలు ఏవి అనగా
1.మత్స్యవతారం.
2.కుర్మావతారం.
3.వరహావతారం.
4.నరసింహ అవతారం.
5.వమనవతారం.
6.పరుశురామవతారం.
7.రామవతారం.
8.కృష్ణవతారం.
9.బుద్ధవతారం.
10. కల్కి అవతారం.
ఇవి పరమాత్ముని యొక్క దశావతారాలు.
అదేవిధంగా జీవుని యొక్క 10 అవతారాలు
1. తల్లిదండ్రుల యొక్క శుక్ల, శోణితములు జీవ కణం గా ఏర్పడడం “మత్స్యవతారం”.
2. పిదప తల్లి గర్భంలో ముద్ద గా గట్టి పడి ఇంద్రియాలు గా ఏర్పడడం “కుర్మావతారం”.
3. తదుపరి తల్లి యొక్క గర్భ గోళంలో ఒక బంతి వలే రూప క్రియోన్ముఖుడై తిరగడుతుండడం ఇది “వరహావతారం”.
4. ఆ తర్వాత తల్లి యొక్క గర్భములో నవ మాసాలు తర్వాత నుండి ఓ భయానక రూపంతో ఉద్బవించడం “నరసింహవతారం”.
5. బుడి బుడి నడకలతో తడబడుతూ సర్వము తిలకించడం ధర్మ అధర్మములను దేవా ధనవ మానవ వ్యష్టి సమిష్టి లను సమ దృష్టికి తేవడం “వామనవతారం”.
6. అదే విధంగా ఏక లక్ష్యం ఏక నిష్ఠ గరిష్టుడై ఎచ్చు తగ్గులు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏకాగ్రత చిత్తుడై పాలించువాడు “పరుశురామవతారం”.
7. కష్ట నష్టాలతో కాడిస్తూ సుఖ శాంతులతో సౌలభ్యం పొందుతూ ధర్మ,అధర్మల సౌలభ్యం పొందుతూ
ఏక పత్నీ వ్రతుడై తల్లిదండ్రులు, గురువుల ధర్మ సూత్రాలను అనుసరిస్తూ ఉండం. “రామవతారం”.
8. సూత్ర ధారుని వలే ధర్మ అధర్మములకు వ్యష్టి సమిష్టి లకు విచక్షణ జ్ఞానం పొంది సర్వ కార్యములకు కారణ రూపం దాల్చి ఆ కార్యములకు అంటుకోక విలక్షణుడై విడమర్చి చెబుతూ సంపూర్ణ జీవిత సారం ఎరిగిన పరిపూర్ణుడు అట్టి వాడే “కృష్ణవతారుడు”.
9. శబ్ద స్పర్శ రూప రస గ్రంథ విషయ వాంఛల యందు భౌతిక వాంఛలను విసర్జించి భువన భవన ములకు బద్ధుడు కాక భరించువాడు అట్టి వాడే “బౌద్దవాతారుడు”.
10. కల్ప, అకల్పములు కారణ, అకారణములు కర్తృత్వ బొక్రుత్వంములను భయకంపితమై విజృంభిస్తూ విచక్షణ జ్ఞానంచే ఆజ్ఞాపించువాడే “కల్కిఅవతారుడు”.
దీనిని నెరుగాక లోక కంఠకులై ఇంద్రియలోలులై విమర్శ జ్ఞానం లేక పతనానికి కారకులౌతున్నారు.
– శివరాం శంకర్ నాయుడు
చాలా గొప్పగా వ్రాసారు. మీకు శుభాకాంక్షలు.