వినాశకాలే విపరీత బుద్ది
ఇటివల జరుగుతున్న సంఘటనలు అవేంటో తెలుసుకుందాం.
మొన్న ఆడపిల్ల వేరే కులపు పిల్లాడిని పెళ్ళి చేసుకుందని హత్య చేసారు, అలాగే ప్రియురాలు ప్రేమించ లేదని ఆమెను పొడిచి చంపాడు. ప్రియురాలి తో బ్రేకుప్ అయ్యాక వేరే వారికి దగ్గర అయ్యంది అని ఆ ఇంకో వ్యక్తిని మద్యం తాగించి, చంపేసి, పెదవులు, గుండె, పేగులు , రహస్య అంగాన్ని కోసి, ప్రియురాలికి పంపడం , ఇలాంటివే కాకుండా పిన్ని, తల్లి,చెల్లి, వదిన అనే తేడా లేకుండా వావి వరసలు మరచి సంభంధాలు పెట్టుకోవడం.
రూపాయి కోసం దగ్గరి మిత్రులను చంపడం, సరిగ్గా చదవడం లేదని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం, తల్లి పెన్షన్ డబ్బు కోసం చంపడం, వాటిని ముక్కలు చేసి వీధుల్లో పారేయడం, ప్రేమిస్తున్నా అని చెప్పి తల్లిదండ్రులకు తెలియకుండా సహా జీవనం చేయడం, అది బెడిసి కొట్టి చంపడం, ఒక లాయర్ హోదాలో ఉంటూ భార్యను బయటకు రాకుండా చేయడం . ఆమెను మానసికంగా చంపడం, హింసించడం.
తండ్రి ఉద్యోగం రావాలని అతన్ని చంపేసి ఒక రాత్రాoతా అలాగే ఉంచి తెల్లారి శవాన్ని ముక్కలు చేసి ఎక్కడెక్కడో పారేసి రావడం. ఇవన్ని కాకుండా మనకు తెలియనివి చూడనివి ఎన్నో రహస్యంగా జరుగుతున్నాయి,. అమ్మో వింటుంటేనే ఒళ్ళు గగుర్పాటు కలుగుతుంది కదా,
మరి ఎందుకు ఇలా అంటే మానసిక సమస్యలు,అసూయా,ద్వేషాలు,నాకే దక్కాలి అనే ఆశ, కోరికలు, విపరీత మనస్తత్వంలాంటివి కారణాలు. అది నాది అని అనుకున్న తర్వాత ఇంకొకరు వస్తే ఓర్వలేకపోవడం. కులం అంటూ ఇప్పటికి అడ్డుగోడలు వేయడం,చంపితే డబ్బు వస్తుందని ఆశ పడడం, నేరం చేసాక దొరకము అనే ఒక నమ్మకం తో ఇలా చేస్తున్నారు.
కాని తర్వాత జరిగేది ఏమిటి ? ఎవరో ఒకరు వ్యక్తి కనిపించడంలేదని అడగడం. పోలీసులు రావడం, అరెస్టులు చేయడం,ఇక వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండడమే, ఆవేశం లొ చేసినా, అలోచించి చేసినా తర్వాత జైల్లో మగ్గుతే ఇంకేం అనుభవిస్తారు.ఈ చిన్న లాజిక్ ని కూడ మర్చిపోయి వాళ్ళు నేరం చేయడం. తర్వాత బాధ పడి ప్రయోజనం ఏముంది.
ఈ కరోనా తర్వాత ఇలాంటి నేరాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఎందువల్ల అంటే చస్తామో ,బ్రతుకుతామో తెలియని స్థితిలో మానసిక స్థితి బాగాలేని వారే ఇలా చేస్తున్నారు, అందుకే నేరాలు పెరుగుతున్నాయి.మానసిక స్థితిలో మార్పులు వచ్చాయి,అంటే దేశం వినాశనానికి,మనిషి వినాషనానికే ఇలాంటి వైరస్ లు పుడుతున్నాయి. ఇలాంటి రోగాలు వస్తున్నాయి.
ఇలాంటి విచిత్ర సంఘటనలు జరగడం మానవాళి అంతానికి ఆరంభమే అని నా అభిప్రాయం. వినాషనానికి నాందిగా ఇవి జరిగి,విపరీత బుద్ధులు చూపిస్తూ కలియుగం అంతం అవబోతుంది, నిజానికి రానున్న రోజుల్లో మనిషిని మనిషే చంపుకుని తింటాడు అని అనుకోవడం లో అతిశయోక్తి కాదు.
ఎందుకంటే ఇలాంటి సంఘటన కూడా జరిగింది వేరే దేశంలో భర్తను చంపి,అతని అవయవాలు గ్రైండర్ లో వేసి ముక్కలు చేసి, బిర్యానీ వండి వేరేవారికీ పెట్టిందోక మహా ఇల్లాలు. సమస్య ఏదైనా సరే కాని మనిషిని చంపడం చేస్తారా, ఇవన్ని విపరితాలే కదా,వినశానాలే కదా,
ఎంతమంది డాక్టర్ లు కౌన్సిలింగ్ లు ఇచ్చినా, ఎవరెంత చెప్పినా నేను ఇలా రాసే సమయానికి ఇంకెన్ని ఘోరాలు జరిగాయో ఎవరికీ తెలుసు. అందుకే మనిషీ మేలుకో నీ చుట్టూ ఉన్నవారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండు,ఎప్పుడూ ఎవరూ ఎలా మారతారో ఎవరికీ తెలియదు, కాబట్టి నువ్వు, నీ కుటుంబం, నీ చుట్టూ ఉన్నవారిని గమనిస్తూ,నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పడం నా ధర్మం, బాధ్యత కాబట్టి చెప్తున్నాను.
-భవ్యచారు
గమనిక: భయ పెట్టాలని కాదు ఉన్న నిజాలు చెప్పడానికి రాసింది మాత్రమే.