వందనం
మాతృ భూమి విముక్తి కొరకు….
స్వేచ్ఛా వాయువుల కొరకు…..
ఎందరో మహానుభావులు
మరెందరో సమరయోధులు
కుల మతాలకతీతంగా…
ఆకలి దప్పులు మరచి…
నిద్రాహారాలు మాని….
దేశ భక్తిని నింపుకుని
అలుపెరుగని పోరాట ఫలితం…
నా స్వాతంత్ర్యం
ఎన్నో విషాదాలు…
ఎన్నో కన్నీళ్ళు…
సంకెళ్లు వేసి….
చెరసాలల్లో బంధించి…
లాఠీ దెబ్బలతో….
బూట్ల పదఘట్టనలతో..
మేను రక్త సిక్తమైనా..
ఎత్తిన పిడికిలి దించని ధీరుల ఫలితం
నా స్వాతంత్ర్యం
ధన మాన ప్రాణాలకు వెరవక…..
స్వాతంత్ర్యం నా జన్మ హక్కంటూ….
సింహాల్లా గర్జిస్తూ…
నేలకొరిగిన అమరుల త్యాగం…
నా స్వాతంత్ర్యం
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలకులను
గజ గజ వణికించిన
ఎందరో త్యాగధనుల పోరాట ఫలితం
నా స్వాతంత్ర్యం
నేడు నా దేశ ఔన్నత్యం
నా దేశ ధీరత్వం
నా దేశ శాంతి తత్వం
ప్రపంచమంతా
కనిపించేలా… వినిపించేలా….
విను వీధుల్లో త్రివర్ణ పతాకం రెప రెప లాడింపజేసి…
చరితలో తమకంటూ పేజీని లిఖింపజేసుకుని
చిరంజీవులైన
సమరయోధులకు
జోహర్…. జోహార్….
నా త్రివర్ణ పతాకానికి
వందనం…. వందనం
– రహీం పాషా