కలల కన్నీరు
కష్టం ఎక్కువైతే కన్నీరోస్తుంది
కాలంజరిగితేకష్టంపోతుంది
అంటారుపెద్దలు!
మూగ భాషల లోతులు
ఉద్వేగాల ఊయలలు
మది నిండిన మమతలు
కనికట్టు మాటలు
ఉప్పొంగిన ఊసులు
కటిక నిజాల కారుణ్యం
గుండె లోతుల్లోన గుర్తులు
జ్ఞాపకాల వరదలు
అర్దం కాని ఆవేదన
భాష లేని భావన
అంతరంగపు రోదన
మాట వినని మనసు
మనసువిప్పిన పుస్తకం
గుబులు మిగిల్చిన భారం
స్థితిని దాచిన వైనం
రేయి దాటిన పగలు
ఎదురు చూసినప్రతిబింబం
కలలు కంటున్న ప్రతి రోజు
హాయిగొలిపే అవకాశం
వుండనే ఉండదుకదామరి
అదే మనిషికి తెలియని
మర్మము సుమా…….?
– జి జయ