వానరసేన
రాజు,రాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు రమేష్ , సురేష్. ఇద్దరూ కవలలు. వేసవి సెలవులువస్తే పిల్లలు ఇద్దరూ అల్లరి చేస్తూ ఇల్లు పీకి పందిరేసినంతపని చేస్తారు. వారికి పక్కింటివాళ్ళు తోకలు లేని కోతులు అని బిరుదును ఇచ్చేసారు. మామూలురోజుల్లోనే వాళ్ళు చేసేఅల్లరికి అంతుండదు.అలాంటిది శెలవలవటంవల్ల వారి అల్లరికి అడ్డూ,అదుపూ లేకుండా పోయింది.
ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళ వాహనాల టైర్లలో గాలితీయటంతో అది చూసినవారంతా రాజు ఇంటికి వచ్చిగొడవచేయటం మొదలుపెట్టారు. రాజు వాళ్ళ కాళ్ళూ-గడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడి పంపేవాడు.ఒక రోజు ఇంట్లో ఉన్న టీవీ కడుగుతామని బక్కట్లో నీరు పట్టి తెచ్చారు.
సమయానికి అమ్మ రాణి చూసింది కాబట్టి టీవీరక్షించబడింది. లేకపోతేటీవీ నాశనం అయిపోయేది.రాత్రి పూట పక్కింట్లోకి రాళ్లువేసేవారు. మొదట్లో రాళ్ళువేసిందెవరో తెలియకపోవటంతో రమేష్, సురేష్ గురించి వాళ్ళు పట్టించుకోలేదు కానీ తర్వాతవారికి విషయం తెలిసి రాజుఇంటిపై యుద్ధానికి వచ్చారు.
రాజు వారికి సర్దిచెప్పి పంపాడు. పిల్లల అల్లరితోరాజుకు టెన్షన్ మొదలైంది.అతనికి బీ.పీ పెరిగిపోసాగింది.రాణి ఎప్పుడూ ఇంట్లో ఉండేదికాబట్టి పిల్లల అల్లరి భరించలేక సాయంత్రం భర్త రాగానే భోరున ఏడ్చేది. తల్లిదండ్రులు ఇద్దరికీ ఏమి చేయాలో తెలియటం లేదు. పిల్లల అల్లరి తారాస్థాయికి చేరింది.
అపార్ట్మెంట్ టాంకులో కారం పొడి కలపటం చేసారు.
పక్కింటి వాళ్ళకుక్కలకు పిచ్చెక్కించే విధంగావాటిని హింసించ సాగారు. దాంతో అవి కన్ఫూషన్ తో వాటి యజమానులనే కరిచేసాయి. పక్కింటి పిల్లలెవరూ వీరు చేసేఅల్లరికి భయపడి వారింటికిరావటం లేదు. తండ్రి రాజుకుఆఫీసునుండి ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది.అమ్మ రాణికి జ్వరం వచ్చేసింది. అప్పుడేరమేష్, సురేష్ టీచర్రాజుని బజార్లో కలిసాడు.
రాజు ఆయనతో తన బాధ చెప్పుకున్నాడు.పరిష్కారం చూపించమని అడిగాడు. అప్పుడు టీచర్రాజుతో”చూడండి రాజూ,మీ పిల్లలు అల్లరివాళ్ళే కానీఎదైనా పని ఇస్తే చక్కగా చేస్తారు. వారు ఖాళీగాఉన్నప్పుడే అల్లరి చేస్తారు.వారికి ఈ వేసవి సెలవల్లోడాన్స్, గేమ్స్ నేర్పించండి.చాలా సమ్మర్ క్యాంపులు ఉంటాయి. వాటిలో చేర్చండి.అక్కడ చేతి నిండా పని
ఉంటుంది కాబట్టి మీ జోలికి రారు. డాన్స్ నేర్చుకుంటూ,గేమ్స్ ఆడుకుంటూ బిజీగాఉంటారు.”అని సలహా చెప్పాడు. మాష్టారు చెప్పిన మాటలను రాజు అమలు పరిచాడు. పిల్లలకు ఇష్టమైనగేమ్స్ నేర్పించాడు. డాన్స్ కూడా నేర్పించాడు. వారిలో అల్లరి తగ్గింది. తల్లిదండ్రులు
ఇద్దరూ సంతోషించారు.
-వెంకట భానుప్రసాద్ చలసాని