అమ్ములు
అమాయకం గా ..
ముద్దుగా కనిపించే
లేతమోము…విశాలంగా..
చక్కగా నల్లగా కనిపించే
చక్రాల్లాంటి కనులు..
చక్కని ముక్కు..
అతికినట్లు ఉండే
చిన్ని పెదాలు..
నల్లని..రింగు రింగు వెంట్రుకలతో
రెండు జడలు…
తుళ్లిపడే గోదావరి
పరుగులాంటి నడక ..
సెలయేటి గలగలలా మాటలు…
పిల్ల తెమ్మరలాంటి…పాటలు..
అందంగా ముద్దుగా కనిపించే..
పరికిణి…జాకెట్‌తో…ఎనిమిదేండ్ల పసిడిబొమ్శ..వెరసి..
అమ్శులు.🌷
పండగకు ..
అందరూ తయారయ్యే వేళ
దీని తలరాత మారి
మనసు గోరింటాకు మీదకు మళ్లింది
పల్లెలో గోరింటాకు చెట్లు ఎన్శి ఉన్శా..
పెద్ద కామాంధుని …
ఇంటి గోరింటాకు కు దిగదిడుపే..!
మాపుకాసి ..పాలేరు రంగడుమామ కు
మాటలు చెప్పి గోరింటాకు
కోసుకోవడానికి సంతోషం తో
అందమయిన లేడిపిల్లలా
ఎగురుకుంటూ ..పెరటి వయిపు వెళ్లింది
సంతోషం తో..తన చేతులను
ఎర్రగా మార్చే గోరింటాకు ను
నలుగురికి చూపించాలనే
ఉత్సాహంతో… ప్రమాదం
కామాంధుని కొడుకు రూపంలో
పొంచి ఉందని తెలియని అమ్ములు…!
పసిదాన్ని చూసిన ..
కామాంధుని కొడుకు లో
పశువాంఛ మొదలై
దానిని.. తీర్చుకొనుటకై..
రంగుల బొమ్మల పెట్టె చూపిస్తానని
అమ్ములును నమ్మించి
తనవెంట తీసుకెళ్లాడు..
అతన్నే అనుసరించిది
కసాయి నే నమ్మిన మేకలా..!
పాపపు ఆలోచనలతో…
మదమెక్కిన కీచకుడు..
కారుణ్యమే లేని కాలనాగులా
అమ్ములును కాటేసాడు..
అమ్ములు చిన్ని చేతులు..
ఎర్రగా కందిపోయాయి….
కసాయితనం కసిమొగ్గను…
కాలరాచేసింది.. !
ఆ కర్కోటకుని చేతిలో
ఎనిమిదేండ్ల పసిడిబొమ్శ
ప్రాణంలేనిబొమ్శయ్యింది
పంచభూతాలే సాక్షిగా
దైవ సన్శిధిలో ..నిశబ్దముగా
నూరేళ్లు నిండిపోయాయి…
అమ్ములు తల్లితండ్రులు
భోరుభోరున విలపించారు ..
శపించేస్తున్శారు నాశనం కావాలని..!
అందమైన పాప ..
అద్దంలా..ముక్కలయ్యిందేనని…
అక్కసుతో..ఆవేశంతో
ఏదో చేయాలని వారి ఆక్రోశం..
అధికార బలం..
పెద్దల ప్రాబల్యం..
నాయకుల దౌర్జన్యం..
అన్నీ కలిసి కొమ్ముకాచి
అమ్ములు బతుకును
బుగ్గిపాలు..చేసింది..!
కారుణ్యం లేని కామవాంఛకు
బలి అయిపోయ్యింది..
నిజాన్ని నిగ్గువిడచి చెప్పలేని
ధరిత్రి కూడా బావురుమంటూ ..
కౌగిలించుకుంది.. అమ్ములును..
అమ్మా! నీకన్యాయం జరిగిపోయ్యింది
అని చెప్పలేక కసిమొగ్గగానే …
రాలిపోయిన అమ్ములును..
తనలోనే..తనతోనే..
ఇముడ్చుకుంది ..!
ఇవన్నీ తెలియని అమ్ములు ఆత్మ ..
తన కందిపోయిన..చేతులు…
గోరింటాకు తోనే ఎర్రగా పండాయని
అనుకుంటోది.. అమాయకంగా…
అంతేగానీ..ఎవర్నీ న్యాయం
అడగాలో కూడా తెలియని
లేత పసితనం…ఒకవేళ…అమ్ములు ఆత్మ ..న్యాయం అడిగితే..
ఎవరిని అడగాలి….?
చట్టాలను చేసిన ..
రాజ్యాంగాన్నా..?
రాజ్యాంగం వ్రాసిన
రాజ్యాంగ నిర్మాతలనా?
వెలకట్టలేని శీలానికి..
వెలకట్టి..జరిమానా
విధించే న్యాయమూర్తులనా..?
ఈ సంఘటనను చూసినా మిన్నకుండిన ..సంఘాన్నా..?సమాజాన్నా..??
లేక విధిరాతను
వ్రాసిన విధాతనా..??
ఎవరిని అడగాలి..???
అలా ప్రశ్శిస్తే..
అందరిలో శూన్యం..
అంతా.. శూన్యం..
మౌనమే సమాధానం..
మానం.. ప్రాణం..
పోయినవారికి…!
పాపం ‘ చేసిన
కామాంధుని చేతిలో ..
“పాపం” అమ్ములు
కడతేరిపోయ్యింది…
కలలే కనని ..తెలియని..
పసితనం లేతమొగ్గగానే..
వికసించకుండానే
రాలిపోయ్యింది…!
పాపం అమ్ములు..
అయ్యో..పాపం అమ్ములు..!!
🌹🌹🌹🌹
అంకితం…జమ్శూలోని కథువా జిల్లా రస్సానా గ్రామ బాధితురాలైన..”అసీఫా” అను ఎనిమిదేండ్ల అమ్మాయిని పాశవికంగా..ఆటవికంగా..
అత్యాచారం చేసి మానవత్వమే..సిగ్గుపడేలా..
హత్య చేసారు.ఆ అమ్మాయి ఆత్మశాంతి కై ప్రార్దిస్తూ..మరెందరో..ఇలాంటి భాదితులైన అమ్మాయిలకు..మానంపోయి..మౌనంగా రోదిస్తున్శ..ఎంతోమంది..అతివలకు
నాహృది రక్తాక్షరాల
ఈ శోకతప్త సమావృతం…
కన్నీటి తో అంకితం ..అంకితం..!!?
-గురువర్థన్ రెడ్డి