వాలుజడ

వాలుజడ

మా అమ్మమ్మకు ముగ్గురు కూతుళ్లు..అందులో పెద్ద కూతురు కు అంత పెద్ద జడేమీ లేదుచిన్న కూతురుకూ లేదు..కానీ మధ్యలో కూతురు ( అంటే మా అమ్మకు ) పెద్ద
వాలు జడ..మా అమ్మమ్మకు అసలు జడ వేయడమే రాదట తనేమెా వంట పని చేసే అలసి పోయేదట..

ఆ మాత్రం ముగ్గురికే నంట చేసి అలసి పోవడమేంటి?అనుకుంటున్నారు కదూ!అయితే మీరు పప్పులో కాలేసారన్న మాటే!అయినా అది మీ తప్పు కూడా కాదులెండి..
నేనే చెప్పలేదు కదూ!మా అమ్మమ్మకు ముగ్గురు కొడుకులు కూడా!
అదీ సంగతి..

అయినా వాలు జడ గురించి చెప్పకుండా ఇదేం సోదిఅనుకుంటున్నారా?దాంట్లోకే వస్తున్నానండి..అయితే వాలుజడ పోషణంతా మా తాతగారి పనన్నమాట ..
మా తాతగారేమెా సంచారం పోయేవాల్లట మంచి కవీశ్వరులు ఆ మాటకొస్తే మా వృత్తే అదండి..
మా వాల్లంతా ఉపాధ్యాయులే!

అయ్యెా! మళ్లీ వాలు జడ నుండి బయటకు వచ్చా!ఆ జుట్టుకంతా రాగెటి మట్టి రుద్ది తల స్నానం చేయించి జుట్టు ఆరాక నూనె పెట్టి ఎల్లిపాయ జడ వేసి
టైట్ గా! తను వచ్చే వరకు అలాగె చెక్కు చెదరకుండా
ఉండేలా వేసి పోయేవారట..

మా అమ్మ జడ కోసం మా తాత గారు నానా తిప్పలుపడేవారట..కానీ ఆ జడ చూసే మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకున్నారట..
అదండీ వాలు జడ సంగతి..

నచ్చితే చెప్పండి చదివిన పాఠకులూ! ఒకెనా!!

 

-ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *