వదిలితిని పో నీ విచక్షణకు!!
కడుపు నిండుగ ముద్ద,
కంటి నిండుగ నిద్ర,
వరములాయె మాకు
బరువులయ్యే నిట్లు
నిత్య పూజలు…!
మావి భారమైన బ్రతుకులు
కష్టమంటే మాకు
మోయు ఇసుక మూటలు……….!
ఎట్లొస్థిమో,
అట్లనే పోదుము…………!
మా తలకి మించిన బరువులు
నీ నగల మూటలు……………!
మాది శారీరక కష్టము.
నీది మానసిక నష్టము.
నీ రోగాలు,
రాలవు ఏ దైవ పూజలకు…….!
నీ కడుపుకెక్కదు ముద్ద
నీ కనుల నిండదు నిద్ర
మేము వరాలై పొందినవవి,
నీకు శాపాలౌను కదరా……!
– వాసు