తోడు నీడ
జంట యెప్పుడైన జట్టువీడగరాదు
కలిసి మెలిసి యున్న కలదు సుఖము
కలలు గన్నరీతి కలుగు సంతానమ్ము
సంతు బాగుపడిన సంతసంబు
ఆడ మగ ఇరువురు అంతరాలే లేక
కంటిపాప లాగ కలిసి యుండి
కాపురమ్ము గుట్టు కాపాడుకోవాలి
ఇరుగు పొరుగు వారు ఇష్టపడగ
భర్త కష్టమెరిగి భార్య నడచుకుంటె
భంగపాటు లేక భవిత యుండు
గొడవ జేసి.అలిగి.గొంతెమ్మ కోర్కెలు
తీర్చుమనెడి యాలి దిష్టిబొమ్మ
– కోట