తిరుమల గీతావళి
పల్లవి
తపియించె మనసు
నిను చూడాలియనుచు
జపియించ సాగెనుగా
గోవింద నామమును
చరణం
గల్లంతు కాగా ఆశలన్నియు మావి
నీవే దిక్కనుచు కొలిచేము స్వామి
కాపాడమనుచు వేడేము నిన్ను
కలలోనయినా దర్శనము ఈయవా
చరణం
ఇబ్బందులున్నాయని నీ తలపు మానము
మనసు తలుపులను తెరిచి ఉంచేము
కొలువై ఉంటావని కోరికలను తీర్చేవని
మా నిధివి నీవు మా సన్నిధివి నీవు
మరిచిపోకయ్యా
తరతమభేదములు లేవు నిను చూచువారికి
చరణం
నీ నీడచాలుగా నీ ధ్యాసనిలిపేందుకు
నీ తోడు చాలుగా
కష్టములను దాటేందుకు
నిను నమ్మినాము
మన్నించి రావయ్యా
మమతనే పంచేందుకు
వేగమే రావయ్యా
వెతలు తీర్చేందుకు
– సి.యస్.రాంబాబు