నీడ
కొత్త ఆలోచనలతో మనిషి వికసించడు
కొత్త గృహంలో నివసించాలనుకుంటాడు
కొత్తగా మార్పేమీ చెందడు
పాతనే కొత్త చేద్దామనుకుంటాడు
సర్వమానవ సౌభ్రాతృత్వం అంటాడు
మతం కులం ప్రాంతం కంచె వేసుకునుంటాడు
ఋతుశోభను ఆస్వాదిస్తాడు
ఋతుమార్పులను ఆకళింపు చేసుకోడు
తన నీడే తనని భయపెడుతుంటుంది
నిజాలను దాచుకున్న నీడ ఎక్కడ ప్రశ్నగ మారుతుందోనని
– సి.యస్.రాంబాబు