తిరుమల గీతావళి
పల్లవి
శ్రీనివాసుని చూసెదమండీ
కష్టాలన్నీ తీరునులెండి
పదమే పాడుతు కదలాలండీ
ఏడుకొండలు ఎక్కెదమండీ
చరణం
కలియుగమున వెలసినవాడు
నిత్యపూజలను గైకొనువాడు
భక్తసులభుడూ శ్రీనివాసుడు
అభయమునిచ్చి కాపాడేవాడు
చరణం
కలతలు నలతలు తనవంటాడు
తనువు మనసు తనదందాము
కలియుగమందున వెలసినవాడు
వేదనలన్నీ తెలిసినవాడు
చరణం
చిరునవ్వేగా తన ఆభరణము
తన కరుణేగా మనసాధనము
అండగ నిలిచి ధైర్యమునిచ్చి
వేడుక చేయును మన జీవితమును
– సి.యస్.రాంబాబు