కిలాడి లేడీ ఎపిసోడ్ 1
అనగనగా ఒక చిన్ని మారు మూల పట్నం. సాంకేతికకి దూరంగా ఉండే ఆ పల్లెకి ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి చెప్పిందే వేదం అయ్యేలా మార్చుకున్నాడు.
డబ్బు సంపాదనలో తనకి అవినీతే తన మంత్రం ! మోసమే తన ధ్యేయం! ఎల్లపుడూ అందరినీ మోసం చేస్తూ హాయి గా తన జీవనం నీ గడప సాగాడు.
అంతలో ఎంతటి వాడికి అయిన నీతి, నిజాయతీ ముందు తల వంచక తప్పదు కదా. అలాంటి క్షణం లో ఒక అమ్మాయితో స్నేహం కుదిరింది. ఆ అమ్మాయి కూడా మోసానికి తొలి మలి మెట్టు లాంటిది. వాడిని ఆడించింది, ఆలిచందింది లాలించింది. అయితే ఆ కిలాడి లేడీ ఆ సర్పంచి దగ్గరే ఉన్నవి మెల్లగా లాగడం మొదలు పెట్టింది.
ఆశ చూపింది, వల విసిరింది. ఆ కిలాడి లేడీ తన ప్రయోజనం కోసం తన కన్న తల్లి కూడా బలి చేసింది. అయితే ఈ సర్పంచ్ సారు ఊరి వాళ్ళని మాత్రం డబ్బు సంపాదనలో మాత్రమే వాడుకున్న అమాయక ఈ మగ మనిషి నీ ఈ కిలాడి లేడీ ఈ అవసరం ఆ అవసరం అని తేడా లేకుండా అన్నింటా వాడుకొడం మొదలు పెట్టింది..
ఆ కిలాడి వలలో పడ్డాడు అని తనకి తెలియదు కదా.. ఎంతటి తెలివి కల వాడు అయిన ఎక్కడో చోట తప్పు తాడు అనేది ఇక్కడ అబ్బినట్లు అయింది. అయితే ఆ కిలాడి మాయ మాటలతో దూరం వెళ్ళింది.. ఇక్కడ మాత్రం కిలాడి వలలో పడిన వాడికి ఊరిలో ఎదురు దెబ్బలు మొదలు అయ్యాయి.. సాంకేతిక దగ్గరే దానీ కి కారణమో లేక ఆ కిలాడి మాయన అనేది ముందు కథ లో చెప్తాను!
– భరద్వాజ్