తిరుమల గీతావళి
పల్లవి
నీ చరణములే కోరితిమయ్యా
నీ శరణమునే వేడితిమయ్యా
మా వేదనయే తెలిసిన నీవు
మార్గము చూపి కాపాడవయా
చరణం
నిను చూసినచో అలుపేలేదు
నీ తలపొకటే చాలును మాకు
అది కలిగించును ఎంతో హాయి
మా నీడవు నీవే అండవు నీవే
చరణం
ఏడుకొండలను చూసినచాలు
బతుకే మారును ఆ వేడుకతోటి
కలియుగమందున అంతా మాయే
నీ చూపొకటే సత్యము స్వామీ
చరణం
కాలినడకన నిను చేరాలని
కోరిక కలిగెను తీర్చవ స్వామీ
తప్పులు ఎన్నో చేసిన మాకు
నిను దర్శించుటయే విరుగుడు స్వామీ
చరణం
కలలోనైనా కనిపించవయా
మనసుకు కలుగును ఎంతో శాంతి
గోవిందాయని పిలిచెదమయ్యా
మా గుండెలలో నిలవాలనుచు
– సి. యస్ రాంబాబు