తిరుమల గీతావళి
పల్లవి
లోకబాంధవుడవుగా
వినవయ్య మా మొరను
పెదవేదో పలికింది
మనవేదో చేసింది
చరణం
కలియుగ దైవమని
నిను కొలిచేమయా
పిలుపే వినమని
నిను తలిచేమయా
చరణం
నీడగ నీవుంటే
తోడుగ వెంటుంటే
పండగ ప్రతిరోజూ
పాటగ ప్రతిక్షణము
చరణం
కమ్మని నీ నవ్వు
వెచ్చగ నీచూపు
మముతాకితే చాలు
ముత్యాలు రాలునుగ
చరణం
మాటలు రావంట
మమతే నీవంట
లేదంట ఏతంటా
పండునిక బతుకంటా
– సి. యస్ రాంబాబు