చిన్నారి పెళ్లి కూతురు
అందంగా ముస్తాబు అయి కూసుంది లిల్లీ
పెళ్లి వారి కంటే ముందే వెలిసింది జాజిమల్లి..
అందరూ తోరణాలు అల్లుతుంటే…
జడకి పూలు అల్లుతుంది మల్లి.
కుదురుగా ఉంటూ కలలను ముందుకు నెడుతూ
కూసింది పీటల మీద తన మీద పడేది తాళి
అని భావించింది కానీ ఎగతాళి అని మాత్రం కాదు..
బాధ్యతలు తెలియని పసితనం, కష్టాలు అలవాటు
కానీ ఉన్నత కుటుంబం మరి..
అయినా కానీ తనకి ఎదో ఆత్మవిశ్వాసం..
భరించింది అన్నింటినీ..
– మల్లికార్జున్ గుండా