తిరస్కరించిన వాకిలి
ఎన్నో ఆశలతో పల్లెటూరి నుండి నగరానికి వచ్చినరవికి చాలా ఎదురుదెబ్బలే తగిలాయి. ఉండటానికి ఇల్లువెతకడానికే అతనికి చాలాకాలం పట్టింది. ఆ తర్వాతఉద్యోగం కోసం చేసిన చాలా ప్రయత్నాలు చాలా కాలం తర్వాత సఫలం అయ్యాయి.అంతా బాగుంది అనుకునేలోపు రవి ప్రేమలో పడ్డాడు.రవి ప్రేమలో పడింది అతనిఇంటి ఓనరు కూతురుతోనే.
ఆమె పేరు మాల.మాల ఆ రవి మంచితనాన్ని,కష్టపడే తత్వాన్ని చూసిఅతనితో ప్రేమలో పడింది.రవి కూడా మాల అంటే
ఇష్టపడ్డాడు. ఇలా జరుగుతూఉండగా వారి ప్రేమ విషయంమాల అన్నయ్యకు తెలిసింది.
అతను కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. రవిని రాత్రికి రాత్రి రూమ్ నుండి ఖాళీచేయించారు. లత తండ్రి రవిని
గురించి ఎంక్వైరీ చేసాడు. రవిది తమ కులం కాదని తెలిసింది.
పైగా అతనికి పెద్దగా ఆస్తులు లేవని తెలిసింది. రవికిపాత రూమ్ దగ్గరే రూమ్ దొరికింది. లత ప్రేమను అతనుమర్చిపోలేక పోతున్నారు. లతతల్లిదండ్రులు ఆమెను బెదిరించి రవిని కలవకుండాచేసారు.
రవి మాత్రం ఆ తిరస్కరింపబడిన ఇంటిముందే పిచ్చివాడిగా తచ్చాడుతూ ఉన్నాడు.ఇప్పటికీ తచ్చాడుతూనేఉన్నాడు. జనాలు ఆ పిచ్చివాడికి డబ్బులు ఇవ్వసాగారు.ఆ పిచ్చివాడు ఆ డబ్బులువిసిరివేసేవాడు. ఎందుకంటే అతనికి కావలసినవి డబ్బులుకాదు లత ప్రేమ.
లత ఆ పిచ్చివాడి ప్రేమను స్వీకరిస్తుందా,లేదా అనే విషయానికి కాలమే సమాధానం చెప్పాలి.
-వెంకట భానుప్రసాద్ చలసాని